seasonal diseases | పెద్దపల్లి రూరల్ సెప్టెంబర్ 21 : వర్షాకాలం వర్షాలు వరుసగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని కళాశాల అధ్యాపకులు రాజేంద్రప్రసాద్ అన్నారు. పెద్దపల్లి మండలంలోని హన్మంతునిపేటలో ఆదివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అద్వర్యం లో నడుస్తున్న శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు.
ఈ సందర్భంగా వాలంటీర్లతో ఇంటింటికీ ప్రచారం చేస్తు వ్యాధులపట్ల అప్రమత్తతకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో 55 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అధ్యాపకులు సదానందంలతో పాటు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కేసదయ్య అధ్యాపకులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.