Awareness | కోరుట్ల, జనవరి 14 : కోరుట్ల పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై ఎస్సై చిరంజీవి ఆధ్వర్యంలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న ద్విచక్ర వాహనదారులకు గులాబీ పుష్పాలు అందించి హెల్మెట్ ధారణ ప్రాముఖ్యత వివరించారు.
వాహనదారులు హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం ఆటో డ్రైవర్ లతో కలిసి రోడ్డు భద్రత అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.