జగిత్యాల రూరల్/జగిత్యాల టౌన్, ఫిబ్రవరి 24 :చదువుతోనే సంచార జీవనానికి విముక్తి లభిస్తుందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, వృద్ధులు, దివ్యాంగ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుడగజంగాల కులానికి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో చేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని సాధనకు కృషి చేయాలని రాష్ట్ర పిలుపునిచ్చారు. జగిత్యాల రూరల్ మండలం చల్గల్లో ‘మన ఊరు- మన బడి’ కింద జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ.17.95 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్‌తో కలిసి మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అలాగే రూ.33 లక్షలతో సీసీ రోడ్లు, గీత పారిశ్రామిక స హకార సంఘం భవనం మిగులు పనులు, ఉపాధిహామీ కింద రూ.61 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలోని బుడగజంగాల కాలనీ ఎంపీపీఎస్ పాఠశాలలో రూ. 11.70 లక్షలతో చేపట్టిన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సర్కారు స్కూళ్లకు కా ర్పొరేట్ హంగులు కల్పించేందుకు దేశంలో ఎక్కడాలేనివిధంగా మన ఊరు-మన బడికి అంకురార్పణ చేశారని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ.7వేల కోట్లు, జిల్లాలో రూ. 70 కోట్లు వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు. స్వపరిపాలనలోనే సర్కారు స్కూళ్ల లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. గురుకులాలు నిర్మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యనందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు అద్భుత విజయాలను సాధిస్తున్నారని, దేశంలోని ప్రఖ్యా త యూనివర్సిటీల్లో సీట్లు పొందడమే గాకుండా నీట్, ఐఐటీ లాంటి పోటీ పరీక్షల్లో సత్తా చూపుతున్నారని పేరొన్నారు. గురుకులాల్లో వొకేషనల్ కోర్సులను సైతం ప్రారంభిస్తున్నామని చెప్పారు. పత్తిపాక జడ్పీ స్కూల్లో అభివృద్ధి పనులు పూర్తి చేశామని, విద్యార్థుల కోసం డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ తరగతులు ఏర్పాటు చేశామని తెలిపారు. ప దో తరగతి విద్యార్థులు 10 జీపీఏ సాధించాలని, ఈ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారి సందేహాలను ఎప్పటికప్పుడు ని వృత్తి చేయాలని సూచించారు. పాఠశాలలో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గుజరాత్ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీ అధికమన్నారు. దేశంలో కుల, మత రాజకీయాలు నడుస్తున్నాయని, దేశం పిచ్చో ళ్ల రాజ్యంలా తయారైందన్నారు. మోదీ సర్కారు బడా, కార్పొరేట్ వ్యాపారులకు చెందిన రూ.12 లక్షల కోట్ల బ్యాంక్ లోన్ రద్దు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. అదానీ కంపెనీల్లో లక్షల కోట్లు ఆవిరయ్యాయన్నారు. అది దేశ వినాశనానికి సంకేతమని, ఎల్ఐసీ లాంటి సంస్థలు కూడా షేర్లలో పెట్టుబడి పెట్టి నష్టపోయాయన్నారు. ఎ మ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ చల్గల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి అందరికీ తెలియాలని, అసత్యపు మాటలు నమ్మవద్దన్నారు.
సీసీ, బీటీ రోడ్లకు రూ.1.30 కోట్లు, రైతు వేదిక కోసం రూ.25 లక్షలు కేటాయించామని, రూ.2కోట్లతో మిషన్ భగీరథ పైప్‌లైన్, రైతు బంధు ద్వారా రూ.10 కోట్లు ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో జ మ చేశామన్నారు. రూ. కోటి రైతుబీ మా వారి ఖాతాల్లో జమయ్యాయని, 744 కరెం ట్ మోటర్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, సోలార్ విద్యుత్‌లో అత్యధిక ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. జడ్పీ చైర్పర్సన్ వసంత మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉన్నత వర్గాలతో సమానంగా పేద, మద్య పిల్లలు గొప్ప గా చదువుకునేందుకే మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. జగిత్యాల జి ల్లాను అన్నింటా అగ్రగామిగా నిలిపేందుకు మం త్రి కొప్పుల ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. ‘మీరు నేను’ కార్యక్రమంలో భాగంగా ఎ మ్మెల్యే సంజయ్ నియోజకవర్గవ్యాప్తంగా పల్లె నిద్ర చేస్తూ ప్రజల సమస్యలను విని అక్కడికక్కడే పరిష్కరించడం అభినందనీయమన్నారు. అనంతరం గతంలో సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంఫాజుల్నగర్ బ్రిడ్జి వద్ద వరదలో కొట్టుకుపోయి మృతి చెందిన జగిత్యాల రూరల్ మండలంలోని చల్గల్ గ్రామానికి చెందిన బుర్ర గంగు, బాబు కృతిక్ల కుటుంబానికి ఎస్డీఆర్ఎఫ్ రాష్ట్ర విపత్తు నిధి ద్వారా మంజూరైన ఒక్కొక్కరికీ రూ.4లక్షల చొప్పున మొత్తం రూ.8లక్షల ప్రొసీడింగ్‌లను మంత్రి కొప్పుల అందజేశారు. బుడగజంగాల కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూ ల మాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ మంద మకరంద, ఎంపీపీ రాజేంద్రప్రసాద్, సర్పంచ్ ఎల్ల గంగా నర్సు రాజన్న, ప్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆసిఫ్, డీఈవో జగన్మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ పద్మ తిరుపతి, ఎంపీడీవో రాజేశ్వరి, ఎంఈఓ గాయత్రి, తహసీల్దార్ నవీన్, ఏఈ రాజమల్లయ్య ఉన్నారు.