PEDDAPALLY | పెద్దపల్లి టౌన్, ఏప్రిల్ 10 : దండకారణ్యంలోని అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ ముడిమడుగుల మల్లన్న ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని, ఆదివాసీలపై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను గురువారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.1990 నుండి 2025 వరకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ హంట్ సాల్వజుడు ఇలాంటి పేర్లతో ఆదివాసులను అక్కడినుండి తరలించే వ్యూహాత్మక చర్యల్లో భాగంగానే అక్కడ నివసిస్తున్న ఆదివాసీలను అక్కడినుండి తరిమివేయాలని, హత్యలు అత్యాచారాలు బూటకపు ఎన్కౌంటర్లు చేస్తోందని ఆరోపించారు. ఇంద్రవెల్లి పోరాటం మాదిరి ఆదివాసీల పైన జరిగిన హత్యాకాండము నిరసిస్తూ ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో కమిటీ వేసి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రధాన భక్తులుగా వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్, పాశం యాదగిరి, ప్రొఫెసర్లు గడ్డం లక్ష్మణ్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొంటరాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి లక్ష్మణ్, బాలసాని రాజయ్య, ఎరుకల రాజన్న, కె విశ్వనాథ్, వెల్తురు సదానందం, పులిపాక రవీందర్, గుమ్మడి కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.