చిగురుమామిడి, మార్చి 17: ఆశాల( Asha workers) సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. బడ్జెట్ సమావేశాలలో ఆశలకు ఫిక్స్డ్ వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆశాలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు కోరారు.
అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేళ్ల శ్రీలత, మండల అధ్యక్షురాలు నాగేల్లి పద్మ, కార్యదర్శి బోయిని ప్రియాంక, అంజలి, కవిత, కమల, సరోజన, సునీత, శోభ, లింగవ్వ, సాహిదా బేగం తదితరులు పాల్గొన్నారు.