Collector Satya Prasad | కథలాపూర్, జూన్ 9 : భూభారతి చట్టంపై గ్రామసభలు నిర్వహిస్తుండగా. భూమి సమస్యలపై వచ్చిన దరఖాస్తులను అధికారులు త్వరగా పరిష్కరించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. కథలాపూర్ మండలం తండ్రియాల, గంభీర్ పూర్ గ్రామాల్లో భూభారతి చట్టంపై నిర్వహిస్తున్న గ్రామ సభలను సోమవారం ఆయన పర్యవేక్షించారు.
రైతుల ఇచ్చే దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పహానిలను పరిశీలించి పరిష్కరించాలన్నారు. సమస్యలను పరిష్కరించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. రెండు గ్రామాల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ వినోద్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నాగేష్ పాల్గొన్నారు.