తిమ్మాపూర్,మార్చి10 : ఆన్లైన్ గేమ్స్‌కు(Online games) బానిసై మరో యువకుడు బలయ్యాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపెల్లి గ్రామానికి చెందిన సిరికొండ తిరుపతిరావు అనే వ్యక్తికి బీఎస్సీ అగ్రికల్చర్ మూడో సంవత్సరం చదువుతున్న సిరికొండ నిఖిల్ రావు (22) ఒకే కొడుకు ఉన్నాడు. అయితే నిఖిల్ రావు గత కొంతకాలంగాఆన్లైన్ గేమ్స్ కు బానిసై అప్పులు చేశాడు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో బయట పరువు పోతున్న ఉద్దేశంతో తిరుపతిరావు ఇటీవల రూ.4 లక్షల ఇతరులకు చెల్లించాడు. అప్పటి నుంచి నిఖిల్ ను ఇంటి వద్ద ఉంచుతున్నారు.
అయితే పరీక్షలు ఉన్నాయని చెప్పడంతో తన తండ్రి తిరుపతి రావు సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కరీంనగర్ బస్టాండ్ లో హైదరాబాద్ బస్సు ఎక్కించిన తన తండ్రి కూరగాయలు తీసుకొని మార్కెట్లో అమ్మకోవడానికి వెళ్ళాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో తిరుపతిరావు కౌలుకు చేస్తున్న జాప రవీందర్ రెడ్డి అనే రైతు వ్యవసాయ బావిలో స్థానికులకు వ్యక్తి మృతదేహం కనిపించడంతో సమాచారం అందించగా కుటుంబ సభ్యులు చేరుకొని పరిశీలించగా నిఖిల్ రావుగా గుర్తించారు. నిఖిల్ రావు తండ్రి తిరుపతి రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్ఎండీ ఎస్సై వివేక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.