Chigurumamidi | చిగురుమామిడి, మే 13 : చిగురుమామిడి మండల కేంద్రంలోని పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో మూడు రోజులుగా అత్యంత వైభవంగా హనుమజ్జయంతి ఉత్సవాలు, ఆలయ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మయూరగిరి పీఠాధీశులు జ్యోతిష్య వాస్తు ఆగమ శాస్త్ర పండితులు శ్రీమాన్ శ్రీ నమిలకొండ రమణాచార్య స్వామి ఆధ్వర్యంలో శ్రీ ఉమేష్ స్వామి నిర్వహణలో అగ్ని ప్రతిష్ట, హోమాలు, పూజలు, ఆంజనేయ స్వామికి అభిషేకం, కల్యాణం, మహా పూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, బలిహరణం మొదల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి.
రమణాచారి స్వామి మాట్లాడుతూ పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం చాలా విశేషమైనదని, ఇక్కడి వచ్చిన భక్తులు ఏ కోరికెలు కోరుకుంటే ఆ కోరికలన్నీ నెరవేరుతున్నాయని హనుమాన్ జయంతి రోజు సుమారు 11 వేలమంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని అన్నారు. మరో కొండగట్టు లాంటి అద్భుతమైన ఆలయం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణమాచార్యులు, వినయ్ స్వామి మొదలగు పండితులు ఉత్సవాలలో పాల్గొన్నారని తెలిపారు.