chigurumamidi | చిగురుమామిడి, ఏప్రిల్ 24: మండల కేంద్రంలో మొదటి అంగన్వాడి కేంద్రం లో విధులు నిర్వహించిన మీనుగుల ప్రమీల ఆయమ్మ అనారోగ్యంతో చెందింది. కాగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మట్టి ఖర్చులకోసం (దహన సంస్కారాలకు) రూ.10 వేలు అందజేశారు.
అలాగే చిగురుమామిడికి చెందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు 50 కిలోల బియ్యం మృతురాలు కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీలత, అంగన్వాడి టీచర్లు ధనలక్ష్మి, అనురాధ, సంపూర్ణ, ఇందిరా, ఆయాలు పద్మ, కనకవ్వ తదితరులు పాల్గొన్నారు.