Bommanapally | చిగురుమామిడి, సెప్టెంబర్ 25 : చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల 1989-90 పదో తరగతి కి చెందిన 40 మంది పూర్వ విద్యార్థులు 35 సంవత్సరాల తర్వాత పాఠశాలలో ఒకే వేదికపై కలిసి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోషల్ మీడియా వేదిక ద్వారా ఏర్పాటు చేసుకున్న ఈ సమ్మేళన కార్యక్రమానికి వారికి విద్యా బోధనలు నేర్పిన గురువులను ఆహ్వానించారు. అనంతరం ఒకరికొకరు కుటుంబ పరిస్థితులు, జీవన విధానాలను అడిగి తెలుసుకున్నారు. కష్టసుఖాలను పంచుకున్నారు.
తమకు విద్యను నేర్పిన గురువులను శాలువాతో సత్కరించి మెమొంటో అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి సహపంక్తి భోజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణరావు, విశ్రాంత ఉపాధ్యాయులు కొత్త ప్రభాకర్ రెడ్డి, తాటిపల్లి ప్రభాకర్, ఉమ్మెతల రాఘవరెడ్డి, భోజనపల్లి రామానుజం, మల్లన్న శాస్త్రి, మాజీ సర్పంచ్ కానుగంటి భూమిరెడ్డి, మాజీ ఎంపీటీసీ మిట్టపల్లి మల్లేశం, పూర్వ విద్యార్థులు కోల రవీందర్, బైరి శ్రీనివాస్, విక్రమాచారి, రవి, రామచంద్రం, భూమయ్య, స్వామి, సమ్మయ్య, దొడ్ల వెంకటరెడ్డి, చంద్రయ్య, సాంబయ్య, వేణుగోపాల్, శ్రీనివాస్, సాయిలు, కొమురయ్య, రఫిక్ తదితరులు పాల్గొన్నారు.