Chigurumamidi | చిగురుమామిడి, జనవరి 11 : చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం ప్రభుత్వ పాఠశాలలో 25 సంవత్సరాల క్రితం విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులందరూ మిత్ర బృందంగా ఏర్పడి అపూర్వ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం పాఠశాల ఆవరణలో సర్పంచ్ బోయిని రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో చదువుకున్న విద్యార్థులు అందరూ ఉన్నత పదవులలో ఉన్న వారందరూ ఒకే వేదికగా హాజరయ్యారు.
గ్రామ పాఠశాల అభివృద్ధితో పాటు గ్రామ అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. నాటి పాఠశాలలో చదువుకున్న గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. అనంతరం తమకు విద్యను నేర్పిన గురువులను శాలువా మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. అందరూ కలిసి సహపంక్తి భోజనం నిర్వహించి, సంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.