Godavarikhani | గోదావరిఖని : డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని సింగరేణి అర్జీ.1 యాజమాన్యం ఆధ్వర్యంలో డీజీఎం పర్సనల్ డి. కిరణ్ బాబు అధ్యక్షతన జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, అర్జీ -1 ఏరియా జీఎం డీ లలిత్ కుమార్, ఆర్జీ -1 ఏరియా సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్, ఎసీ, ఎస్టీ ఎంప్లాయీస్ వేల్ఫేర్ అసోషియోషన్స్ నాయకులు హాజరయ్యారు.
ముందుగా గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుండి జీఎం కార్యాలయం వరకు మహిళా డప్పు కళాకారులు కోలాటం బృందం, డీజే తో భారీ ర్యాలీ నిర్వహించారు. జీఎం కార్యాలయ ఆవరణలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వివిధ శాఖల ఉన్నతాధికారులు పూల మాలలు వేసి నివాళులు అర్పించి, జెండా ఆవిష్కరించారు. అనంతరం బారీ కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భమును పురస్కరించుకుని సింగరేణి సాంస్కృతిక కళాకారులు మహిళల నృత్యాలు, గీతాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భముగా అర్జీ-1 ఏరియా, జీఎం డీ లలిత్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ తన జీవిత ఆశయ సాధనలో చిన్నప్పటి నుండి వివక్షకు గురై భవిష్యత్ తరాలకు తిరుగులేని భారత రాజ్యంగాన్ని రచించి ప్రపంచ దేశాలకే ఆదర్శప్రాయంగా నిలిచారని తెలిపారు. అలాగే ఏరియాలోని జీడీకే 1,2,2A, 5, OC, 11 ఇంక్లైన్ అన్ని గనులు, డిపార్ట్ మెంట్స్ లలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమములో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.