Bakka Judson | ఖమ్మంలో ఏడ్చేవాళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనడం మాజీ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక పెయిడ్ పొలిటిషియన్ అని మాజీ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. పొంగులేటి పెయిడ్ ఆర్టిస్ట్ అయివుండి ఇల్లు కోల్పోయిన వాళ్ళను పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నాడు. పొంగులేటి వైఎస్సార్సీపీ నుండి బీఆర్ఎస్ పార్టీకి పెయిడ్ ఆర్టిస్టుగానే వచ్చాడు.. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీకి పెయిడ్ ఆర్టిస్టుగా వచ్చాడు
‘తుమ్మల నాగేశ్వర్రావు మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు గ్లాసులు అందించేటోడు.. చిన్న కాంట్రాక్టర్.. ఇవాళ పేమెంట్లతో ఇంతపెద్ద ఆర్టిస్టుగా నువ్వు (పొంగులేటి) తయారైనవు. అంటే వేరేవాళ్లను పెయిడ్ ఆర్టిస్టులంటూ మాట్లాడే స్థాయికి వచ్చినవు. పార్టీలు మారుతున్నా కొద్దీ నీకు ప్రమోషన్స్ పెరుగుతున్నయి. ఇవాళ నువ్వు మల్కం చెరువులో గచ్చిబౌలిలో కొన్ని మల్టీస్టోర్ అపార్ట్మెంట్స్ కట్టే పరిస్థితి ఉన్నది. కూల్చివేతలు జరిగిన ప్రదేశానికి ఎదురుగా ఉన్న ఎన్ఎస్పీ స్థలంలో కట్టిన నీ ఎస్ఆర్ ఫంక్షన్ హాల్.. ఏ జాగా అది కూలగొట్టొద్దా..? అది ఎందుకు కూలగొడుతలేరు. అది కూలగొడితే 100 ఇండ్లు కట్టొచ్చన్నాడు బక్క జడ్సన్.
‘ఇక్కడ నువ్వు 600 ఇండ్లు కూలగొట్టినవ్. నేను దీనిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీల ఫిర్యాదు కూడా చేసిన. అవి దానం ఇచ్చిన భూములు.. ఆ భూముల్లో ఇండ్లు కట్టుకోవచ్చు. ఓ పెద్ద మనిషి వినోబాబావే పిలుపు మేరకు భూదానం చేసిండు. ఆ భూమిలో 100 గజాల చొప్పున ఆ కుటుంబాలు ఇండ్లు కట్టుకున్నయ్. నీ అయ్య జాగా కాదు.. నీ అవ్వ జాగా కాదు. తుమ్మల అయ్య జాగా కాదు.. భట్టి అయ్య జాగా కూడా కాదు. ఒక దానం చేద్దామనుకున్న భూస్వామి వాళ్లకు దానం చేసిండు. ఆ దానం చేసిన ఇండ్ల గురించి మాట్లాడితే నువ్వేమో పెయిడ్ ఆర్టిస్టులంటవు.. నువ్వో పెయిడ్ పొలిటీషియన్వు. కూల్చివేతల విషయం తనకు తెలియదన్న విషయమై బక్క బడ్సన్ మాట్లాడుతూ.. జిల్లా మంత్రివై ఉండి ఆ విషయం తెలియదంటే నువ్వు మినిస్టర్‌గా అన్‌ఫిట్.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీ కొడుకు మీద, నీ మీద FIR ఫైల్ చేసినందుకు ఒక ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేశావని’ పొంగులేటికి గుర్తు చేశారు బక్క జడ్సన్.
భూదాన్ భూములలో ఇండ్లను కూలగొట్టే 15 రోజుల ముందు తుమ్మల నాగేశ్వర్ రావు పోయి చంద్రబాబును కలిశాడని.. ఇప్పుడు వెలుగుమట్ల భూములలో ఇండ్లను కూలగొట్టే జాగాలో టీటీడీ దేవస్థానం వస్తుంది.. దానికోసమే చర్చించడానికి చంద్రబాబుని కలిశాడన్నారు. భట్టి విక్రమార్కకు సంబంధించి కూడా కొన్ని విషయాలు 2 రోజుల్లో బయట పెడుతానన్నారు.
ఇవాళ దేవుడా రేవంత్ రెడ్డి కళ్లు మా ఇళ్ల మీద, భూముల మీద పడకుండా చూడమని ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ వస్తే రోడ్డు మార్గంగుండా తీసుకుపోకుండా ఎక్కడ నిరసనకారులు వచ్చి ప్రశ్నిస్తారో అని భయపడి హెలికాప్టర్లో తీసుకుపోయారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గాంధీ విగ్రహం పెట్టుకోవాలి అంటే నీ ఇల్లు కూలగొట్టు మంది ఇళ్ళతో నీకేం పని..గాంధీ మనవడే ఇల్లు కూల్చి గాంధీ విగ్రహం పెట్టొద్దని చెబుతున్నాడు.. ఆయనకి ఉన్న బుద్ధి మీకు ఎందుకు లేదని బక్క జడ్సన్ చురకలంటించారు.
పొంగులేటి శ్రీనివాస్ ఒక పెయిడ్ పొలిటిషియన్
ఈయన పెయిడ్ ఆర్టిస్ట్ అయివుండి ఇల్లు కోల్పోయిన వాళ్ళను పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నాడు
పొంగులేటి వైసీపీ నుండి బీఆర్ఎస్ పార్టీకి పెయిడ్ ఆర్టిస్ట్ గానే వచ్చాడు.. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీకి పెయిడ్ ఆర్టిస్ట్ గా వచ్చాడు
నీ కొడుకు… https://t.co/1i4LCTsN6A pic.twitter.com/8i5rGeyUTO
— Telugu Scribe (@TeluguScribe) March 2, 2026
Toxic | యష్ ‘టాక్సిక్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తబాహి’ రిలీజ్.. ఆడియోతోనే అంచనాలు రెట్టింపు!