Veenavanka | వీణవంక, ఏప్రిల్ 14 : మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో సోమవారం ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రపంచ మేధావి అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందనీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి స్ఫూర్తి అంబేద్కర్ రాజ్యాంగం అని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలు సమానంగా ఫలాలు అనుభవిస్తున్నారంటే అది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ద్వారానేనన్నారు. సమాజంలోని అన్నివర్గాల ప్రజల కోసం కులాలకు, మతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని అందించిన మహానుబావుడు అంబేద్కర్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి అంబాల మధునయ్య, జిల్లా నాయకులు పర్లపెల్లి తిరుపతి, నర్సయ్య, రమేష్, శ్రీనివాస్, రాధాకృష్ణ, కుమార్, సాహెబ్ హుస్సేన్, సురేష్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.