Putta Madhu | మంథని, ఏప్రిల్ 14: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి ని పురస్కరించుకొని మంథనిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి శోభాయాత్ర రథం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. పుట్ట మధుకర్ తన నివాసం రాజ గృహ నుంచి మహనీయుల దీక్ష పరులతో కలిసి ప్రత్యేక రథంతో జై భీమ్ నినాదం డీజే సాంగ్స్ తో భారీ ఊరేగింపుగా అంబేద్కర్ చౌక్ లోని విగ్రహం వద్దకు చేరుకున్నారు. మార్గమధ్యలో జై భీమ్ పాటలకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, దీక్షాపరులు నృత్యాలు చేశారు. అనంతరం పుట్ట మధుకర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దీక్షపరులు సైతం అంబేద్కర్ కు నివాళులర్పించారు. అంబేద్కర్ నగర్లోని అంబేద్కర్ కుంటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, గౌతమ బుద్ధుడి విగ్రహానికి పుట్ట మధుకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహనీయుల దీక్షపరులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. భారీ బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల సమూహం జయంతి ప్రత్యేక శోభాయాత్ర రథం జయంతోత్సవం లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.