Chigurumamidi | చిగురుమామిడి, జూలై 11 : చిగురుమామిడి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతి గదిని సర్పంచ్ ఆకవరం భవాని, మండల విద్యాధికారి జయప్రద, స్కూల్ కాంప్లెక్స్ శనివారం ప్రారంభించారు. చిన్నారులకు పలకలు, ప్రీ ప్రైమరీ పుస్తకాలు పంపిణీ చేశారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కాంప్లెక్స్ సత్యం హెచ్ఎం మహమ్మద్ ఇర్షాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుజాత, ఉపాధ్యాయులు రజని, అన్నపూర్ణ, ప్రభాకర్ రెడ్డి, సీఆర్పీల యూనియన్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి ఆంజనేయులు, ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ జమున, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.