AIYF | చిగురుమామిడి, ఆగస్టు 4: అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) చిరుమామిడి మండల శాఖ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రామాండ్లపెల్లి యుగంధర్ తెలిపారు. మండల అధ్యక్షుడిగా ముల్కనూరు గ్రామానికి చెందిన పైడిపల్లి శశికుమార్, ఉపాధ్యక్షుడిగా గట్టు మనోజ్, ప్రధాన కార్యదర్శిగా రేకొండకు చెందిన చెంచల రవి, సహాయ కార్యదర్శిగా గందె పవన్, సూరం శ్రీనివాస్, కోశాధికారిగా బిస అజయ్ ను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు లేక కొట్టుమిట్టాడుతున్నారని, ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల పోరాటాలను చేపడుతుందన్నారు. మండలంలో ఏఐవైఎఫ్ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తామని వారు అన్నారు.