Singareni | గోదావరిఖని : సింగరేణి సంస్థలో అపరిస్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ సోమవారం సమ్మె నోటీసు జారీ చేసింది. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం ఇతర సమస్యలను పరిష్కరించకపోవడంతో విసిగి వేసారిన గుర్తింపు కార్మిక సంఘం చివరకు సమ్మె చేయడం తప్ప మరో మార్గం లేదని సమ్మె నోటీసు జారీ చేసింది.
యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ఆధ్వర్యంలోని నాయకులు మిరియాల రంగయ్య, మడ్డి ఎల్లయ్య, వైవీ రావు, వీరభద్రం, ముస్కే సమ్మయ్య, సారయ్య, రంగు శ్రీనివాస్ తదితరులు జీఎం పర్సనల్ కవితా నాయుడుకు సమ్మె నోటీసును అందజేశారు. కాగా ఎప్పటినుండి సమ్మె చేయాలని విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.