Dharmaram | ధర్మారం జూన్ 6 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అడ్వకేట్లు శనివారం రాష్ట్రమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిశారు . రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేస్తామని చేసిన ప్రకరణ పై హర్షం వ్యక్తం చేస్తూ వారు ఈ మేరకు ధర్మపురి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ను కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మంత్రిని సన్మానించారు.ఈ చట్టం న్యాయవాదులు నిర్భయంగా తమ వృత్తి నిర్వహించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నంది మేడారం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి బొట్ల లక్ష్మీ నర్సయ్య, జాయింట్ సెక్రటరీ ఆకారి రాజేశం, ట్రెజరర్ నూనె సత్యనారాయణ, సీనియర్ అడ్వకేట్ నార అశోక్ రెడ్డి, ఐఎల్పీఏ జిల్లా జాయింట్ సెక్రటరీ జాజాల రమేష్, న్యాయవాదులు కలమడుగు హరిప్రసాద్, అవునురి ఊర్మిళ ,సిద్ధిని బాలలింగం పాల్గొన్నారు.