Responsibility | చిగురుమామిడి, ఏప్రిల్ 18 : రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని, ప్రతీ ఒక్కరూ నివారణకు కృషి చేయాలని ఎస్ఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఎస్సై పృథ్వీధర్ గౌడ్ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మండలంలోని గాగిరెడ్డి పల్లి లో సర్పంచ్ సన్నిల్ల కవిత అధ్యక్షతన శనివారం గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వారు మాట్లాడారు. ప్రతీ వాహనదారుడు తమ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని వేగాన్ని నియంత్రించుకోవాలన్నారు.
దేశవ్యాప్తంగా రోజుకు 500 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ప్రతీ వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వాహన పత్రాలు కలిగి ఉండాలన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్డుపై ప్రమాదం జరిగితే వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సన్నీల్ల వెంకటేశం, ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి, వార్డు సభ్యులు మంద శ్రీనివాస్, సురేష్, శ్రీనివాస్, స్వామి, మానస, రమ, వెంకటేష్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.