దివంగత శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆస్మాన్’. రామ్నందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొండారు వెంకటేష్, మన్నెం శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. శనివారం శ్రీహరి జయంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శాంతిశ్రీహరి మాట్లాడుతూ ‘శ్రీహరిగారి తరహాలోనే మేఘాంశ్ కూడా వృత్తిపట్ల నిబద్దత కనబరుస్తూ కష్టపడుతున్నాడు. మేఘాంశ్‌ని ఇప్పటికీ చిన్న పిల్లాడిలాగానే చూస్తుంటా.
కానీ పోస్టర్ చూశాక సింహాన్ని చూసినట్లు అనిపించింది. మేఘాంశ్ సినీ ప్రయాణానికి మీ అందరి ఆశీస్సులు కావాలి’ అన్నారు. విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శకుడు రామ్నందన్ తెలిపారు. మేఘాంశ్ ఈ సినిమాలో సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తారని నిర్మాత వెంకటేష్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి, నిర్మాణ సంస్థ: శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్, దర్శకత్వం: రామ్నందన్.