హర్మన్ డబుల్ వేల్స్‌పై భారత్ ఘన విజయం
స్వాతంత్య్ర దినోత్సవ వేళ భారత పురుషుల హాకీ జట్టు ఎఫ్ఐహెచ్ ప్రపంచకప్‌ను ఘన విజయంతో ఆరంభించింది. శనివారం జరిగిన పూల్-డీ తొలి మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ డబుల్ గోల్స్‌తో ముందుండి నడిపించడంతో భారత్ 3-1తో వేల్స్‌ను చిత్తు చేసింది.
- హాకీ ప్రపంచకప్‌లో బోణీ
- నేడు చైనాతో అమ్మాయిల ఢీ
అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): స్వాతంత్య్ర దినోత్సవ వేళ భారత పురుషుల హాకీ జట్టు ఎఫ్ఐహెచ్ ప్రపంచకప్‌ను ఘన విజయంతో ఆరంభించింది. శనివారం జరిగిన పూల్-డీ తొలి మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ డబుల్ గోల్స్‌తో ముందుండి నడిపించడంతో భారత్ 3-1తో వేల్స్‌ను చిత్తు చేసింది. 1975 తర్వాత మరోసారి కప్పు నెగ్గాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 10 వేల మంది అభిమానుల కోలాహలం మధ్య ఆరంభ పోరులో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన హర్మన్ 11వ, 43వ నిమిషాల్లో రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచగా, సంజయ్ (8వ ని) మరో గోల్ అందించాడు. సోమవారం జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో భారత్.. మూడో ర్యాంకర్, బలమైన ఇంగ్లండ్‌తో పోటీ పడనుంది.
భారత్‌దే ఆధిపత్యం
ఆట ప్రారంభంలో వేల్స్ జట్టు కొంత దూకుడు ప్రదర్శించినప్పటికీ భారత గోల్‌కీపర్ సూరజ్ ప్రత్యర్థి దాడులను అద్భుతంగా తిప్పికొట్టాడు. వెంటనే భారత్ ప్రతిదాడికి దిగింది. 8వ నిమిషంలో లభించిన రెండో పెనాల్టీ కార్నర్‌ను సంజయ్ పవర్ ఫుల్ డ్రాగ్-ఫ్లిక్‌తో గోల్ పోస్ట్‌లోకి పంపి తొలి గోల్ అందించాడు. కాసేపటికే లభించిన మరో పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్ హర్మన్ గోల్‌గా మలచడంతో ఫస్ట్ క్వార్టర్‌ను జట్టు 2-0 ఆధిక్యంతో ముగించింది. భారత్ 43వ నిమిషంలో మరో గోల్ సాధించింది. ఎడమ వైపు నుంచి హర్మన్‌ప్రీత్ ఫ్లిక్ షాట్ నేరుగా గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లడంతో జట్టు 3-0తో తిరుగులేని స్థానానికి చేరుకుంది. తొలి మూడు క్వార్టర్స్‌లో తేలిపోయిన వేల్స్ కు 56వ నిమిషంలో సామ్ వెల్ష్ గోల్ సాధించి ఓటమి అంతరం తగ్గించాడు. కాగా, అమ్మాయిల వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో చైనాతో భారత్ తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

