బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ దేశంలోనే అత్యంత ధనిక నటుడిగా నిలిచారు. గత ఏడాదితో పోల్చితే ఆయన సంపద దాదాపు 2,490కోట్లు తగ్గినప్పటికీ..సంపన్న నటుడిగా ఆయన స్థానంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. హురుస్ ఇండియా రిచ్‌లిస్ట్ ప్రకారం షారుఖ్‌ఖాన్ ప్రస్తుత సంపద 10వేల కోట్లుగా అంచనా వేశారు. సినిమాలతో పాటు వివిధ వ్యాపారాల్లో పెట్టుబడుల ద్వారా షారుఖ్‌కాన్ భారీ మొత్తంలో ఆర్జిస్తున్నట్లు హురుస్ ఇండియా సంస్థ పేర్కొంది.
రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ద్వారా సినీ నిర్మాణంతో పాటు ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ ద్వారా వస్తున్న లాభాలు ఆయన ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. షారుఖ్‌ఖాన్ తర్వాత అమితాబ్ బచ్చన్ 4వేల కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు.