Singareni | ఏఎల్పీలో ప్రమాదం.. కార్మికుడికి తీవ్ర గాయాలు
రామగిరి మండలంలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు (ఏఎల్పీ)లో సోమవారం జరిగిన ప్రమాదంలో గనిలో విధులు నిర్వహిస్తున్న తుమ్మల సాయి నాథ్ రెడ్డి (జనరల్ అసిస్టెంట్)పై టాప్ పాల్ (గని పైకప్పు భాగం) నుంచి బొగ్గు పెళ్ల కూలి పడటంతో తీవ్ర గాయమైంది.
Singareni | రామగిరి, జూన్ 2 : రామగిరి మండలంలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు (ఏఎల్పీ)లో సోమవారం జరిగిన ప్రమాదంలో గనిలో విధులు నిర్వహిస్తున్న తుమ్మల సాయి నాథ్ రెడ్డి (జనరల్ అసిస్టెంట్)పై టాప్ పాల్ (గని పైకప్పు భాగం) నుంచి బొగ్గు పెళ్ల కూలి పడటంతో తీవ్ర గాయమైంది. కార్మికుల వివరాల ప్రకారం.. కార్మికుడు భూగర్భ గనిలో తన సాధారణ విధులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా పైకప్పు భాగం నుంచి బొగ్గు పెళ్ల ఊడి అతని తలపై పడింది.
దీంతో సాయి నాథ్ గాయం కాగా ఘటనను గమనించిన సహచర కార్మికులు వెంటనే అప్రమత్తమై అతడిని సురక్షితంగా గని నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కార్మికుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ప్రమాద ఘటనపై గని అధికారులు వివరాలు సేకరిస్తూ విచారణ చేపట్టినట్లు సమాచారం. గనుల్లో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని కార్మిక సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఈ ఘటనతో ఏఎల్పీ కార్మికుల్లో ఆందోళన నెలకొంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

