ACB raids | జగిత్యాల, ఏప్రిల్ 11: జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలోని ట్రెజరీ విభాగంలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో ట్రెజరీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రఘు కుమార్ బాధితుని నుండి రూ.7,500 లంచం డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డాడు.
సీపీఎస్ డబ్బుల కోసం జిల్లా ట్రెజరీ శాఖ సీనియర్ అసిస్టెంట్ రఘుకుమార్ రూ.7వేలు డిమాండ్ చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. అయితే బాధితుడి ఖాతాలో డబ్బులు పడడంతో తనకు ఇస్తానన్న ఏడు వేల రూపాయలు ఇవ్వాలంటూ అనేక సార్లు ఫోన్ చేయడంతో బాధితుడు విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని రఘు కుమార్ ను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాసేపట్లో ఏసీబీ అధికారులు మీడియా ఎదుట వెల్లడించనున్నారు.