Thota Agaiah | సిరిసిల్ల టౌన్, మే 28: ప్రొటోకాల్ విషయంలో ఆది శ్రీనివాస్ మాట్లాడిన తీరు విడ్డూరంగా ఉన్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్లలో కేటీఆర్ ప్రజల ఓట్లతో ప్రజల ఆశీర్వాదంతో గెలిచారని అన్నారు. ప్రొటోకాల్ అమలు బాధ్యత జిల్లాలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో సీఎస్ గారికి ఉంటుందన్నారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల లో అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారని, ఆయా కార్యక్రమాలలో ప్రొటోకాల్ ప్రకారం కేటీఆర్ ను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. కేటీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాల ను ప్రారంభించిన అది శ్రీనివాస్ కనీసం కేటీఆర్ ఫొటో పెట్టకపోతే ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రేవంత్ ఫోటో పెట్టాలనడం కాంగ్రెస్ నేతల మూర్ఖత్వానికి నిదర్శనం ఎద్దేవాచేశారు. రేవంత్ రెడ్డికి కూల్చివేతలు తప్పా అభివృద్ధి నిర్మాణాలు తెలవయన్నారు. వేములవాడ లోని క్యాంపు కార్యాలయం పోలీసులకు ఎందుకు ఇచ్చారని, ఆది శ్రీనివాస్ అందులో ఎందుకు ఉండడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ చేసిన అభివృద్ధిలో గోరంత కూడా మీరు సాధించాలన్నారు.
సిరిసిల్ల నియోజకవర్గం లో ఓడిపోయిన వ్యక్తిని పక్కన పెట్టుకుని ఎలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ తన స్థాయి మరిచి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ భవనాల్లో రేవంత్ ఫొటో పెట్టాక సిరిసిల్లకు రావాలని సవాల్ విసిరారు. అధికారంలో ఉంది మీరే కదా దమ్ముంటే ప్రతి ప్రభుత్వ భవనంలో రేవంత్ ఫొటో పెట్టాలని జీవో తీసుకురావాలి అప్పుడు సిరిసిల్ల గురించి మాట్లాడాలన్నారు. చార్ సౌ బిస్ హామీలు అమలు చేశాక రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని కోటాలన్నారు. గ్రామాల్లో ప్రజలు తమ ఇంటి ముందు దిష్టి కోసం రేవంత్ ఫోటో పెడతారని జోస్యం చెప్పారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అధికారిక నివాసంలో పీఎం ఫోటో పెట్టుకోవాలన్నారు.
బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పూర్తిగా కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం పై వంద మంది వచ్చి గుండాయిజం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఆరోపణ చేసినట్లు మేము ఎక్కడా ప్రోటోకాల్ ఉల్లంఘించలేదన్నారు. ప్రజా ప్రతినిధిగా ఎప్పుడూ ప్రోటోకాల్ పాటించానని తెలిపారు. కాంగ్రెస్ నేత భీమవరం శ్రీనివాస్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి అని విమర్శించారు.
మారోసారి ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్యక్రమంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ టిఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారo కృష్ణారెడ్డి దిడ్డి రాజు జి. శ్రీనివాస్ రాజిరెడ్డి ఉమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.