మెట్పల్లి, నవంబర్18 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మెట్పల్లిలో గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పత్తి రైతులకు మద్దతుగా ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన, మంగళవారం ఉదయం సిరిసిల్ల నుంచి కోరుట్ల, మెట్పల్లి మీదుగా బయలుదేరారు. మార్గంమధ్యలో మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్దకు చేరుకోగానే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు చేరుకుని ఘన స్వాగతం పలికారు.
‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పటాకులు కాల్చి కేటీఆర్ కాన్వాయ్‌పై పూలవర్షం కురిపించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు కేటీఆర్‌తో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. కేటీఆర్‌తో కలిసి ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల ఆదిలాబాద్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.