పోడు భూములకు యాజమాన్య హక్కు పత్రాల కోసం అడవి బిడ్డలు దశాబ్దాల కాలం నుంచి కంటున్న కల స్వరాష్ట్రంలో సాకారమైంది. ఈ ఘనత సీఎం కేసీఆర్‌దే. ఆయన సాహసోపేత నిర్ణయంతోనే ఇది సాధ్యమైంది. ఈ సీజన్ నుంచే ఈ భూములకు రైతుబంధు, రైతు బీమా వర్తిస్తుంది. గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. అందులో భాగంగా తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. ఇంటింటికీ నల్లాలు బిగించి, హైదరాబాద్ నుంచి మారుమూల తండాల వరకు ఒకే రకమైన స్వచ్ఛమైన జలం అందుతున్నది.
– మంత్రి కేటీఆర్
సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్/సిరిసిల్ల రూరల్/ కలెక్టరేట్/తెలంగాణచౌక్, జూలై 6 : దశాబ్దాల కాలం గా పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు భూ పట్టాలు పంపిణీ చేసి వారి కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అట్టడుగు వర్గాలకు ఆర్థిక దన్ను అందించడంతో పాటు అడవి బిడ్డలకు భూ హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. ఈ మేర కు ఆయన గురువారం ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి సిరిసిల్ల నియోజకవర్గం లో పర్యటించారు. ముందుగా తంగళ్లపల్లి మండ లం జిల్లెల్లలోని వ్యవసాయ కళాశాలలో ఉదయం 11 గంటలకు మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించి, నివాళులర్పించా రు. అక్కడి నుంచి సమీకృత కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరానికి చేరుకుని 124 మంది వీధి వ్యాపారులకు కుటీర వ్యాపార పథకం కింద రూ.50వేల చొప్పున రూ.62 లక్షల విలువైన ఆర్థికసాయం చెక్కులను అందజేశారు. అనంతరం దళితబంధు పథకం కింద లబ్ధిదారులు కొనుగో లు చేసిన పల్లెవెలుగు బస్సు, సెప్టిక్ ట్యాంక్ క్లీనర్, రెడీమిక్స్ యూనిట్లను కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రారంభించారు. విభిన్నమైన ఆలోచనలతో యూ నిట్లను ఏర్పాటు చేసుకున్న లబ్ధిదారులను మంత్రి కేటీఆర్ అభినందించారు. మధ్యాహ్నం 1 గంటకు పద్మనాయక కల్యాణ మండపంలో జిల్లాలోని 1614 మంది పోడు రైతులకు హక్కు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి ప్రసంగించారు.
దళితులను ధనికులను చేయడమే సీఎం లక్ష్యం
దళితులను ధనికులను చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకుపోతున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయన నాయకత్వంలో దేశం లో ఎక్కడా లేని విధంగా దళితుల కోసం అనేక పథకాలు అందిస్తున్నారని చెప్పారు. దేశంలో ఏం డ్ల తరబడి వివక్షకు గురై, సమాజంలో అణగారిన, అట్టడుగు వర్గాల్లో ఉన్న దళితుల అభ్యున్నతికి చిన్న తరహా పరిశ్రమలు, దళితబంధు పథకాలను అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో సంపద పెంచి, పంచాలనే లక్ష్యం, దృఢ సంకల్పంతో ము ఖ్యమంత్రి ఉన్నారని స్పష్టం చేశారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన దళితబంధు పథకాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో రెండో విడుతలో నియోజకవర్గం లో 1100 యూనిట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దళిత సమాజంలో పరివర్తన కోసం కృషి చేస్తున్నామన్నారు. దళితబంధు మొదటి విడుత లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని లబ్ధిదారులు సుస్థిర జీవనోపాధి పొందేలా యూనిట్లను మంజూరు చేశామన్నారు. సంపద సృష్టించేలా యూనిట్లను గ్రౌండింగ్ చేశామని, ఇందుకోసం కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్న కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు. లబ్ధిదారులు వాహనాలు కొనుగోలు చేయకుండా రైస్‌మి ల్లు, పెట్రోల్ బంక్, కోళ్లఫాం వంటి యూనిట్లను నెలకొల్పడం అనందంగా ఉందన్నారు. దశల వా రీగా దళితబంధును విస్తరించి దళితులకు ఆర్థిక పరిపుష్టి కల్పిస్తామని తెలిపారు. పార్టీలకతీతంగా దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేయాలనే లక్ష్యంతో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు. యూనిట్ల ఎంపికలో సంపూర్ణ వినియోగం ఉండటంతోపాటు పది మందికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
కుమ్రం భీమ్ కల సాకారం
స్వరాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలనే కాదు.. అటవీహక్కు పత్రాలు అందించి జల్, జంగల్, జమీన్ అనే కుమ్రం భీం కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మావ నాటే మావే రాజ్ (మా తండాలో మా రాజ్యం) అనే గిరిజనుల ని నాదంతో 3416 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి 3416 మంది సర్పంచులుగా, 30 వేల మందిని వార్డు సభ్యులుగా రాజకీయంగా అవకాశం కల్పించి, వారి దశాబ్దాల కలను సాకా రం చేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. తమ ప్రభుత్వం ఇంటింటా నల్లాలు ఏ ర్పాటు చేయడంతో హైదరాబాద్‌లో ప్రజలు ఎ లాంటి నీరు తాగుతున్నారో వీర్నపల్లి మండలవాసులు కూడా అలాంటివే తాగుతున్నారని చెప్పా రు. దేశ చరిత్రలో ఏ సీఎం చేయని విధంగా కేసీఆర్ గిరిజనుల సంక్షేమానికి పాటుపడుతున్నారని తెలిపారు. ఆరు శాతం రిజర్వేషన్లను 10 శాతం వరకు పెంచి విద్య, ఉపాధిలో అవకాశాలను క ల్పించారని పేర్కొన్నారు. అటవీ సంపద గిరిజనులకు దక్కాలనే ఉద్దేశంతో హరితహారం కార్యక్రమంతో అడవిని 8 శాతం పెంచినట్లు వెల్లడించా రు. భూ యాజమాన్య హక్కు పత్రాలను పంపిణీ చేసి ఎన్నో ఏండ్లుగా పోడు భూములు సాగుచేసుకుని జీవిస్తున్న గిరిజనులు, ఆదివాసుల చిరకాల కోరికను నెరవేర్చారని చెప్పారు. జిల్లాలో 1614 మందికి 2858 ఎకరాలకు యాజమాన్య హక్కు లు కల్పిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో భూ హద్దు వివాదాలు తలెత్తకుండా పకడ్బందీగా అట వీ యాజమాన్యపు హక్కులు కల్పిస్తున్నామన్నా రు. పోడు పట్టాలకు ఈ సీజన్ నుంచే రైతు బం ధు, రైతు బీమా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి ప్రభుత్వాల హయాంలో గిరిజన తండా ల్లో సీజనల్ వ్యాధులతో బాధపడేవారని కేసీఆర్ ప్రభుత్వంలో ఇంటింటికీ స్వచ్ఛమైన జలం అం దించి, వారి ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తున్నట్లు చె ప్పారు. గిరిజనులకు ప్రత్యేక ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. వందలాది గురుకులాలను ఏర్పాటు చేసి, వేలాది మంది విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు.
ఇంత గొప్ప కాలేజీ దేశంలోనే లేదు
జిల్లెల్ల వ్యవసాయ కళాశాల కన్నా గొప్ప కాలేజీ దేశంలోనే లేదని, పిల్లల భవిష్యత్ కోసం అద్భుత విద్యాలయాన్ని అందించామని, సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వ్య వసాయ విద్య కోసం అద్భుతమైన కాలేజీని అం దించామని, మంచిగా చదువుకొని వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషిచేయాలని సూచించారు. కళాశాల ప్రారంభోత్సవం జరిగినప్పుడు వ్యవసాయ రంగానికి కృషి చేసిన జగ్జీవన్‌రామ్ పేరును కాలేజీకి పెట్టుకుందామని అప్పుటి సభలోనే చె ప్పానని, ఆ ప్రకారం కళాశాలకు జగ్జీవన్ రామ్ పే రుతోపాటు కళాశాలలో భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. జగ్జీవన్‌రామ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ఛైర్ పర్సన్ జిందం కళతోపాటు నాయకులు పుష్పగుచ్ఛం అందించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, సత్యప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్‌కుమార్, జడ్పీ సీఈవో గౌతంరెడి,్డ జడ్పీ వైస్‌ఛైర్మెన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణాధ్యక్షులు జిందం చక్రపాణి, ఎంపీపీ పడిగెల మానస, సిరిసిల్ల, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చెన్నమనేని వెంకట్రావు, సింగిల్‌విండో చైర్మన్లు బండి దేవదాస్‌గౌడ్, కోడూరి భాస్కర్‌గౌడ్, మాజీ చైర్మన్ పబ్బతి విజేందర్‌రెడ్డి, పుర్మాణి రాంలింగారెడ్డి, పడిగెల రాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి, మాట్ల శంకర్, మాజీ ఎంపీపీ పూసపల్లి సరస్వతి, అబ్బాడి అనిల్‌రెడ్డి, అఫ్రోజ్, కళాశాల అసోసియేట్ డీన్ ఉమ, అధ్యాపకులు పాల్గొన్నారు.
దళితుల ఉద్ధరణకే సీఎం ఆలోచనలు
దళితుల ఉద్దరణకే సీఎం కేసీఆర్ ఆలోచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తీసుకువచ్చిన దళితబంధు పథకం దేశంలోని అన్ని మూలలకు తాకింది. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పట్టణ రూపు రేఖలు మార్చి అభివృద్ధికి చిరునామాగా చేశారు. ముఖ్యమంత్రి అన్ని వర్గాలు బాగుండాలని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. దీంతో దేశం తెలంగాణ వైపు చూస్తున్నది. దళితబంధు ద్వారా దళితులు ధనికులు అవుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 40 వేల మందికి యూనిట్లు మంజూరయ్యాయి. వీటిలో 98 శాతం విజయవంతమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది దళిత కుటుంబాలకు దశల వారీగా దళిత బంధు అందిస్తాం. గత 75 ఏండ్లలో దళితులను ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే దళితుల్లో చైతన్యం వచ్చింది. ఎస్సీ కార్పొరేషన్ రుణాల్లో 60 శాతం సబ్సిడీ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. చిరు వ్యాపారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రూ.50 వేల అర్థికసాయం అందించడం వల్ల వారికి భరోసా కలుగుతుంది. అటవీ భూములకు పట్టాలను అందించడం సాహోసోపేత నిర్ణయం. ధృడమైన నాయకత్వం వల్లే ఇది సాధ్యమైంది. గిరిజనుల గూడేలు, తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించడంతో అభివృద్ధి బాట పట్టాయి. గిరిజనులు సమున్నత స్థానాల్లో ఉండాలని గిరిజన పాఠశాలలు ఏర్పాటు చేశారు. పట్టుదల, క్రమశిక్షణతో సీఎం తెలంగాణను దేశానికే మాడల్‌గా తీర్చిదిద్దారు. రానున్న కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండదండలు ఉండాలి.
– మంత్రి కొప్పుల ఈశ్వర్
దేశానికే ఆదర్శవంతమైన పాలన
పోడు రైతులకు భూ యాజమాన్య హక్కు పత్రాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దే. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు. పట్టాలతోపాటు రైతు బంధు, రైతు బీమా పథకాలు ఈ సీజన్ నుంచే వర్తించేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో పోడు పట్టాలు పంపిణీ చేయడంతో గిరిజనులు ఆనందంలో ఉన్నారు. సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శవంతమైన పాలన కొనసాగిస్తున్నారు.
– వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు