Godavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 7 : గోదావరిఖనికి చెందిన శివంగి మహిళా మణులను జయహో స్వచ్ఛంద సంస్థ ఘనంగా సత్కరించింది. ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో పీపుల్ మీడియా సంస్థచే గోదావరిఖనికి చెందిన కూచిపూడి నృత్య కళాకారిణి డాక్టర్ రంగ జ్యోతి, తెలంగాణ సాంస్కృతిక సారథి సీనియర్ కళాకారిణి ఈదునూరి పద్మలు ‘శివంగి’ ఉమెన్ పురస్కారాలు అందుకున్నారు.
ఈ సందర్భంగా మంగళవారం గోదావరిఖని మార్కండేయ కాలనీలో గల స్నేహ సాహితీ గ్రంథాలయంలో జయహో మహిళా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్పర్సన్ జక్కిన శ్రీలత నేత పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. కళారంగంలో కోల్ బెల్ట్ కళామతల్లి ముద్దుబిడ్డలుగా పేరు తెచ్చుకున్న ఉభయులు మరిన్ని శిఖరాలు ఆదిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దయానంద్ గాంధీ, దామెర శంకర్, దయా నర్సింగ్, ఏలేశ్వరం వెంకటేశ్వర్లు, రాజేశ్ శర్మ, కొమ్మ కుమార్ యాదవ్, శ్రీకాంత్, విజయ్, సర్వేశ్, నాగభూషణం గౌడ్, బతుకుల రాజన్న, జనగాం నర్సన్న, రమ, సునీత, రాజేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.