Dharmapuri | చిన్నారి భక్తి పారవశ్యం.. ధర్మపురిలో రంజాన్ ఉపవాస దీక్షతో పాటు ఐదుపూటలా నమాజ్ ఆచరిస్తున్న మూడేళ్ల చిన్నారి
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఒక మూడేళ్ల చిన్నారి భక్తి పారవశ్యంలో ఉపవాస దీక్ష చేపట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. చిన్న వయసులోనే మతపరమైన ఆచారాల పట్ల ఆసక్తి చూపుతూ, కుటుంబసభ్యులతో కలిసి ఉపవాసం పాటించేందుకు ఆ చిన్నారి పట్టుదల చూపింది.
Dharmapuri | ధర్మపురి, మార్చి 7 : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఒక మూడేళ్ల చిన్నారి భక్తి పారవశ్యంలో ఉపవాస దీక్ష చేపట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. చిన్న వయసులోనే మతపరమైన ఆచారాల పట్ల ఆసక్తి చూపుతూ, కుటుంబసభ్యులతో కలిసి ఉపవాసం పాటించేందుకు ఆ చిన్నారి పట్టుదల చూపింది. ఇంట్లో పెద్దలు రంజాన్ ఉపవాసం పాటిస్తూ నమాజ్ చేస్తున్న తీరు చూసి ప్రేరణపొందిన ఆ చిన్నారి కూడా తానూ ఉపవాసం ఉంటానని పట్టుదలగా చెప్పింది.
ధర్మపురికి చెందిన మాజిద్-నిషా దంపతుల నాలుగో సంతానంగా అమైరా జన్మించింది. ఇప్పుడు అమైరా వయసు మూడేళ్లు. మూడేళ్ల వయసున్న చిన్నారి ఉపవాస దీక్షకు మొదట కుటుంబసభ్యులు చిన్నారి వయసును దృష్టిలో ఉంచుకొని నిరాకరించినప్పటికీ, ఆమె పట్టుదల చూసి కొంత సమయం పాటు ఉపవాసం ఉండేందుకు అనుమతించారు.
పెద్దలతో సమానంగా ఉపవాస దీక్షతో పాటు పెద్దలతో కలిసి రోజుకు ఐదు పూటలా నమాజ్ ఆచరిస్తున్నది. చిన్నారి భక్తి. ఆచరణ చూసి కుటుంబసభ్యులు స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే మతపరమైన విలువులు అలవాటు కావడం అనందకరమని పలువురు పేర్కొంటున్నారు. రంజాన్ మాసం భక్తి, సహనం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ పచిత్ర కాలంలో చిన్నారి చూపుతున్న భక్తి భావం అందరినీ ఆకట్టుకోవడంతో పాటు ఆదర్శంగా నిలుస్తోంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

