Siripur | మల్లాపూర్ మే 3: వయసు నిండిన ఓ యువతి, యువకుడి ప్రేమ బంధం చివరికి మరణంలో సైతం వీడలేదు. గత కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకుని చివరికి పెద్దలను సైతం ఒప్పించి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కాబోయే దంపతుల జంట ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో చోటుచేసుకుంది.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం పాతదామరాజపల్లి గ్రామానికి చెందిన మక్కల సాయికుమార్ (21) అనే యువకుడు సిరిపూర్ గ్రామానికి చెందిన ఓల్లెపు శృతి (19) ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెండ్లి విషయంలో కుటుంబ సభ్యులను ఒప్పించినప్పటికీ ఏమాత్రం ఫలితం లేక పోయింది. ఇక్కడి పరిస్థితులు అనుకూలించగా జీవనోపాధి నిమిత్తం సాయికుమార్ గత 8 నెలల క్రితం గల్ఫ్ దేశమైన బెహరాన్ కి వెళ్లి కార్మికుడిగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. తాను అక్కడే ఉండగా ఇక్కడున్న పెద్దలతో మాట్లాడి అందరిని ఒప్పించి రెండు నెలల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.
గల్ఫ్ దేశంలో అక్కడి కంపెనీ యాజమాన్యం ఒత్తిడి భరింపలేక మే 1న గదిలోని ఉరేసుకొని ఆత్మ చేసుకుని మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న శృతి ఒకసారిగా కలత చెంది ఎన్నో అష్ట కష్టాలు పడి పెండ్లి చేసుకుందామన్న నేపథ్యంలో మరణ వార్త విని శోకసముద్రంలోకి మునిగిపోయింది. చేసేదేమీ లేక తీవ్ర మనస్థాపం గురై సిర్పూర్ గ్రామంలోని తన ఇంటి వద్దనే ఉరేసుకొని మరణించింది. ఈ ఆత్మహత్యల సంఘటనలపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన కాబోయే నవ దంపతులు ఇద్దరు మృతి చెందడం పట్ల బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటన మల్లాపూర్ మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.