State Level Volleyball Competitions | ధర్మారం, నవంబర్ 21: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం తెలంగాణ బాలుర గురుకుల విద్యాలయం ఆవరణలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు బాల బాలికలకు అండర్ -14 విభాగం ఎస్జీఎఫ్ 69 వ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల నిర్వహణ కోసం సన్నద్ధ కార్యక్రమాలు మొదలయ్యాయి. గ్రౌండ్ లెవెలింగ్ వాలీబాల్ కోర్ట్ మార్కింగ్ సంబంధించిన కార్యక్రమాలు శుక్రవారం నుంచి చేపట్టారు.
ఈ పోటీల కార్యక్రమాలను ఎంఈఓ పోతు ప్రభాకర్ గతో కలిసి శుక్రవారం ఏఎంసీ చైర్మన్ లావుడియా రూప్ల నాయక్ పరిశీలించారు. రాష్ట్రస్థాయి నిర్వహించనున్న ఈ పోటీలను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని ఎంఈఓ ప్రభాకర్ కోరారు. వాలీబాల్ పోటీల ఏర్పాట్ల కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ విద్యాసాగర్, ఎస్జీఎఫ్ పెద్దపల్లి జిల్లా జిల్లా కార్యదర్శి కనుకుట్ల లక్ష్మణ్, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తమ్మడవేణి రాజయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అరిగే లింగయ్య కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు పోటీలు నిర్వహించే స్థలాన్ని పర్యవేక్షించారు.
కాగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సోగాల తిరుపతి, ఓరెం చిరంజీవి, మాజీ ఎంపీటీసీలు కట్ట సరోజ స్వామి, దేవి సునీత రమణ, బుట్టి సాగర్, సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు కోమల్, వ్యాయామ ఉపాధ్యాయుడు తమ్మడవేణి కుమార్, బైకని కొమరయ్య, రాజశేఖర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.