e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home కరీంనగర్ హరితహారం పకడ్బందీగా చేపట్టాలి

హరితహారం పకడ్బందీగా చేపట్టాలి

హరితహారం పకడ్బందీగా చేపట్టాలి

కరీంనగర్‌, జూన్‌ 24 (నమస్తే తెలంగాణ): జిల్లాలో హరితహారం కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గురువారం ఆయన హరితహారం, పారిశుధ్య పనులు, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, హరితహారం మొకలు నాటేందుకు స్థలాలను గుర్తించి గుంతలు తీయించేందుకు అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 34 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 10 లక్షల మొకలు నాటాలని లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు. మండలానికొక మెగా పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. గ్రామాల్లో పీఆర్‌, ఆర్‌అండ్‌బీ రోడ్ల పకన మూడు, రెండు వరుసల్లో మొకలు నాటాలని సూచించారు. లక్ష్యం మేరకు మొకలు నాటేలా మండలాల వారీగా కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసి పంపించాలన్నారు.

పోలీస్‌శాఖకు లక్ష, అటవీశాఖకు లక్ష, ఆర్‌అండ్‌బీకి లక్ష, పంచాయతీ రాజ్‌ శాఖకు రెండు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు. గ్రామాల్లో గ్రీన్‌ప్లాన్‌ ప్రకారం మొకలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్‌అండ్‌బీ, పీఆర్‌, ఇరిగేషన్‌ ఇంజినీర్లు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ, చెరువు శిఖం భూములు, చెరువు గట్లు, రోడ్ల పకన మొకలు నాటేందుకు స్థలాలను గుర్తించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రతిరోజూ ఇండ్ల నుంచి చెత్త సేకరించి, డంపింగ్‌ యార్డుకు తరలించాలని ఆదేశించారు. మురుగు కాలువలను ప్రతి 15 రోజుకొకసారి శుభ్రం చేయించాలని, పారిశుధ్యంపై సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. గ్రామాల్లో రోజూ ఉదయం ఆరు గంటలకే పారిశుధ్య పనులు ప్రారంభించేలా చూడాలని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులను ఆదేశించారు. ఉదయం 9 గంటలకు గ్రామాల్లో చేపట్టిన పారిశుధ్య పనుల వివరాలు పంచాయతీరాజ్‌ రూపొందించిన యాప్‌లో నమోదు చేయాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు పారిశుధ్యంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సెగ్రిగేషన్‌ షెడ్లను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి, డీఆర్డీవో శ్రీలత, డీపీవో వీరబుచ్చయ్య, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, డీపీవోలు, పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హరితహారం పకడ్బందీగా చేపట్టాలి
హరితహారం పకడ్బందీగా చేపట్టాలి
హరితహారం పకడ్బందీగా చేపట్టాలి

ట్రెండింగ్‌

Advertisement