కొనసాగుతున్న వ్యాక్సినేషన్

విద్యానగర్, జనవరి 21: జిల్లా వ్యాప్తంగా గురు వారం నాల్గో రోజూ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసా గింది. 12 సెంటర్లు, 15 సైట్లలో 973 మందికి టీకాలు వేయాలని లక్ష్యాన్ని నిర్దేశించగా ఇందులో 380 మంది మాత్రమే టీకాలు వేసుకున్నారు. 39 శాతం టీకాలు వేసుకున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుజాత తెలిపారు. హుజూరాబాద్‌లో 83 మందికి 15, జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ దవాఖానలో 300 మందికి 59, విద్యానగర్‌లో 66 మందికి 34, కొత్తపల్లిలో 100 మందికి 40, రామడుగులో 14 మందికి ఐదుగురు, చొప్పదండిలో 85 మందికి 35 మంది, వావిలాలలో 62 మందికి 20, శంకరపట్నంలో 70 మందికి 55, తిమ్మాపూర్‌లో 37 మందికి 36, గంగాధరలో 39 మందికి 36మంది, చెల్పూర్లో 53 మందికి 12, సైదాపూర్‌లో 64 మందికి 33 మం దికి టీకాలు వేశామని తెలిపారు. కరీంనగర్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుజాత, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ రవీందర్‌రెడ్డి, డాక్టర్ జ్యోతి టీకా తీసుకున్నారు. కొవిన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని, టీకాలపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. శుక్రవారం కరీంనగర్లో 163 మందికి, కొత్తపల్లిలో 101 మందికి టీకాలు వేయనున్నట్లు తెలిపారు. టీకాలు వేసుకోనివారు సైతం వేసుకోవచ్చునని సూచించారు. ఆయాచోట్ల వైద్యాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తాజావార్తలు
- గొలుసుకట్టు మోసం.. 24 మంది అరెస్టు
- ట్విట్టర్లో మహిళలు ఏం పోస్ట్ చేస్తున్నారంటే..?
- చిన్నారి రవిని ఆదుకుందాం.. అతనికి నిండైన ఆరోగ్యాన్నిద్దాం
- పులితో పరాచాకాలు ఆడుతున్న విజయ్ హీరోయిన్
- కోతులకు కల్లు ప్యాకెట్ దొరికితే ఊరుకుంటాయా.. ఓ పట్టుపట్టేశాయ్: వీడియో
- ఒక్కరోజే 15 లక్షల మందికి టీకాలు
- తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
- కొవిడ్ టీకా తీసుకున్న హేమమాలిని
- టెస్ట్ చాంపియషిప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్
- ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు