ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి

- పార్టీలకతీతంగా రామమందిర నిర్మాణం చేపట్టాలి
- రామడుగు సింగిల్‌విండో మాజీ చైర్మన్ వీర్ల ప్రభాకర్‌రావు
రామడుగు, జనవరి 20: ఆలయాల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించి, పురాతన ఆలయాల పునరుద్ధరణకు సహకరించాలని రామడుగు సింగిల్‌విండో మాజీ చైర్మన్, వెలిచాల లక్ష్మీనృసింహ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వీర్ల ప్రభాకర్‌రావు కోరారు. మండలంలోని వెలిచాల లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో బుధవారం ఆర్ఎస్ఎస్ తెలంగాణ సంఘచాలక్ బీ దక్షిణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై రామమందిర నిర్మాణ నిధి సమర్పణ కమిటీ సమావేశం నిర్వహించారు. సర్పంచ్ వీర్ల సరోజన, ఎంపీటీసీ వీర్ల వసంత శ్రీరాముడి చిత్రపటానికి పూలమాల వేసి, కరపత్రం, నిధి సమర్పణ పుస్తకాలను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వీర్ల ప్రభాకర్‌రావు మాట్లాడుతూ, శ్రీరాముడు అందరివాడని, అయోధ్యలో రామాలయ నిర్మాణం పార్టీలకతీతంగా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయాల అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ధూప, దీప నైవేద్యాల కోసం నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించి సహకరించాలన్నారు. రామ మందిర నిర్మాణం కేవలం ఒక వర్గానికో, పార్టీకో సంబంధించిన విషయం కాదన్నారు. రాజకీయాలకు తావు లేకుండా సమాజంలోని అన్ని వర్గాలు, హిందువులంతా కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. అనంతరం ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సంఘచాలక్ బీ దక్షిణమూర్తి మాట్లాడుతూ, రామమందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. భక్తులు వీర్ల రవీందర్రావు, నర్సింగరావు, సంజీవరావు, హన్మంతరావు, పెద్దిగారి ఎల్లయ్య, బండపెల్లి యాదగిరి, పూదరి వెంకటేశ్, కల్లెపెల్లి పరశురాం, కాడె నర్సింగం, ప్రభాకర్‌గౌడ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- సందీప్ కిషన్ నా ఫోన్ కాల్ ఎత్తాలంటే భయపడ్డాడు
- చిన్నారుల విద్యకు సోనూ సూద్‌తో చేతులు కలిపిన ఎంఐ మొబైల్స్
- మొలకలు ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది
- బౌద్ధమతం ప్రపంచ శాంతికి ప్రతీక
- అగ్ని ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఐపీఎస్ దంపతులు
- వాలంటీర్లపై ఎస్ఈసీ ఆంక్షలు
- అల్లం రసాన్ని మనం రోజూ తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా..?
- ప్రియావారియర్ కు ఫస్ట్ మూవీనే ‘చెక్’ పెట్టిందా..!
- బెంగాల్లో బీజేపీ కార్యకర్త తల్లిపై దాడి
- మల్లన్న దర్శనం..పులకరించిన భక్తజనం