రామగుండం నియోజకవర్గంలో రెండు నెలల్లో ఐటీ, ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని.. తాను అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత అది సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. రామగుండంలో మెడికల్ కాలేజీ ఆవశ్యకతను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సాధించిన ఘనత ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కే దక్కుతుందని, ఆయనను కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలని సూచించారు. ఈ మేరకు సోమవారం గోదావరిఖని పట్టణంలోని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ‘రామగుండం నవ నిర్మాణ బహిరంగ సభ’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
– పెద్దపల్లి, మే 8 (నమస్తే తెలంగాణ)/ గోదావరిఖని
పెద్దపల్లి, మే 8 (నమస్తే తెలంగాణ)/ గోదావరిఖని : రామగుండానికి రెండు నెలల్లో ఐటీ, ఇండస్ట్రియల్ పార్కులు తీసుకువస్తానని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. సోమవారం గోదావరిఖని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ‘రామగుండం నవ నిర్మాణ బహిరంగసభ’లో ఆ యన మాట్లాడారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తనను కలిసిన ప్రతి సందర్భంలో రామగుండం అభివృద్ధి గురించే మాట్లాడుతారని, ఇక్కడ ఐటీ, ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చే యాలని కోరారని గుర్తు చేశారు. సదరు కంపెనీలు ఆసక్తి చూపుతున్నందున రెండు నెలల తర్వాత ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. తాను త్వరలో అమెరికా వెళ్లాల్సి ఉందని, ఐటీ పార్కుకు సంబంధించి కొన్ని కంపనీల ఆసక్తిని పరిశీలించి రామగుండంలో నెలకొల్పేందుకు కృషి చేస్తానన్నారు.
రామగుండం కార్పొరేషన్‌కు ఇప్పటికే నిధులు కే టాయించామని, మరో రూ.100 కోట్లు కావాలని ఎమ్మెల్యే కోరుతున్నారని, త్వరలోనే సాంక్షన్ లెటర్‌ను అందజేస్తానని అందరి హర్షధ్వానాల మధ్య మంత్రి ప్రకటించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కోసం తపిస్తున్న ఎమ్మెల్యే చందర్‌ను ఇబ్బందులకు గురిచేసేందుకు, బట్ట కాల్చి అతనిపై వేసేందుకు కుట్ర జరుగుతోందని, ఆయనను కడుపులో పెట్టుకుని కాపాడుకోవాల్సిన బా ధ్యత రామగుండం ప్రజలపై ఉందన్నారు. ప్రత్యేక తెలంగాణ పోరులో చురుకైన పాత్ర పోషించిన చందర్‌కు భవిష్యత్ ఉంటుందన్నారు. సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేస్తున్నదని, దానిని గుర్తించాల్సిన అవసరం వారిపై ఉం దన్నారు. సింగరేణి నాలుగు బొగ్గు బ్లాకులను వే లం ద్వారా అమ్మే ప్రయత్నం చేస్తున్న విషయం లో పోరాడాలని పిలుపునిచ్చారు. బార్డర్లో సైనికుల మాదిరిగా పనిచేస్తోన్న సింగరేణి కార్మికులను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఒరగబెట్టేదేమీ లేదని, రామగుండం అభివృద్ధికి సంబంధించి తనపై నమ్మకం ఉంచాలని మంత్రి కోరారు.
రామగుండంపై సీఎంకు మమకారం
“ ప్రత్యేక పోరాట సందర్భంలో ఉద్యమ నేత కేసీఆర్ పిలుపు మేరకు సకల జనుల సమ్మెకు దిగగా, సింగరేణి కార్మికులు చేపట్టిన సమ్మెతో దక్షిణాది ఐదు రాష్ర్టాలకు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.. దేశ సరిహద్దుల్లో సైనికులు ఎలా ప్రాణాలను ప ణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్నారో.. మా వెలుగుల కోసం సింగరేణి గని కార్మికులు ప్రాణాలను లె క్కచేయకుండా బొగ్గును వెలికి తీస్తున్నారు. అం దుకే సీఎం కేసీఆర్‌కు సింగరేణి కార్మికులంటే ఎం తో మమకారం” అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశా రు. తెలంగాణ కొంగు బంగారంగా సింగరేణి ని లుస్తున్నదని, రాష్ర్టానికే వెలుగుల మణిహారంగా ఉందని స్పష్టం చేశారు. సింగరేణి అంటే ఒక కంపె నీ కాదని, తెలంగాణ భాగ్య రేఖ అని, తెలంగాణ జీవనాడి అని స్పష్టం చేశారు. అందుకే సీఎం కేసీఆర్ తెలంగాణ వచ్చిన నాటి నుంచి సింగరేణి కా ర్మికుల కష్టాలు తీర్చేందుకు కృషి చేశారని చెప్పా రు. అలాంటి సింగరేణిని అమ్మే ప్రయత్నం మోదీ చేస్తే రామగుండం అగ్నిగుండం అవుతుందని కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సింగరేణి మనుగడ సాధించాలంటే మన గోడు వినేటోడు ఒకడు ఢిల్లీలో మనోడే ఉండాలని, ఈ బొ గ్గు గనులను కాపాడుకోవాలంటే ఒక బీజేపీ అ భ్యర్థికి కూడా ఓటేయొద్దని సూచించారు.
“కేసీఆ ర్ మీ బిడ్డ .. పార్టీ పేరు మారింది.. కానీ పార్టీ డీఎన్ఏ మార లేదు. మంచిగా పనిచేసే నాయకులు, ప్రభుత్వాలు కోరుకునేది ఒకటే. మంచి తీర్పు ఇవ్వాల్సిన బాధ్య త మీది. కేసీఆర్ హ్యాట్రిక్ ము ఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి” అని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ని త్యం ప్రజల కోసమే పనిచేసే వ్యక్తని, ముఖ్యమం త్రి దగ్గరికి వచ్చినా.. తన దగ్గరికి వచ్చినా రామగుండం అభివృద్ధి గురించే మాట్లాడుతారన్నారు. గతంలో ఇంటర్మీడియట్ కళాశాల కావాలంటేనే ఉద్యమాలు జరిగేవని, కానీ సింగరేణి కార్మికులకు మెడికల్ కళాశాల అందుబాటులో ఉండాలనే సీఎం కేసీఆర్ ఇక్కడ మెడికల్ కళాశాలను ఏర్పా టు చేశారన్నారు. రామగుండంలో బొగ్గు, విద్యు త్, నీళ్లు, సహజన వనరులు, పనిచేసే యువత అందుబాటులో ఉందన్నారు.
సింగరేణిలో పని చేసిన, పనిచేస్తున్న ప్రతి ఒకరూ ఆలోచించాలని, సింగ రేణిలోనూ ఎన్నో మార్పులు వచ్చాయని, కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను కేసీఆర్ నిల బెట్టుకున్నారని చెప్పారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తం అన్న ప్రధాని మోదీ రైతుల కష్టాలు డబుల్ జేసిండని విమర్శించారు. ఇది భారత రాష్ట్ర సమితి కాదని, భారత రైతు సమితి అని వివరించారు. వడగండ్లను చూసి చలించిన కేసీఆర్ హెక్టార్‌కు రూ.25000 ఇస్తున్నారని, సింగరేణిలో ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న 15 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు, కొత్తగా 4207 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చామని, గత ప్రభుత్వాల హయాంలో కర్కశంగా తొలగించిన 540 మందికి తిరిగి ఉద్యోగాలను ఇచ్చామని, పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు, అప్పుడున్న లాభాల వాటా 18 శాతం నుంచి 30 శాతానికి పెంచుకున్నామన్నారు. కార్మికులకు వడ్డీ లేకుండా రూ.10 లక్షల వరకు ఇండ్ల నిర్మాణాలకు రుణాలు ఇస్తున్నామని వివరించారు. ఎ
మ్మెల్యే చందర్ చొరవతోనే రామగుండం ఉజ్వలంగా మా రిందన్నారు. సభలో హోం మంత్రి మహమూద్ అలీ, ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మండలి చీఫ్ విప్ టీ భానుప్రసాదరావు, విప్ బాల్క సుమన్, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత, పెద్దపల్లి, మంచిర్యాల ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, నడిపెల్లి దివాకర్‌రావు, పోలీసు హౌజింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దండె విఠల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, మాజీ ఎమ్మెల్సీ టీబీజీకేఎస్ నేతలు వెంకట్రావ్, మిర్యా ల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య, నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
ఉపాధి కల్పనలో తెలంగాణ టాప్
రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తు న్నాయి. అనేక పరిశ్ర మలు ఏర్పాటై లక్షలాది మందికి ఉపాధిలభిస్తు న్నది. తెలంగాణ ఎవరికీ అందనంత స్థా యిలో ఉన్నది. కేసీఆర్, కేటీఆర్ నేతృత్వంలో పట్ట ణాల రూపురేఖలు మారాయి. సింగరేణి అభివృద్ధి పథంలో దూసుకెళ్తూ దండిగా లా భాలు ఆర్జిస్తున్నది. కార్మికులకు సంక్షేమ ఫ లాలు అందిస్తున్నది. 30 శాతం లాభాల వా టాను చెల్లిస్తున్నది. రామగుండం ఉద్య మా లకు పురిటి గడ్డ. రాష్ట్ర సాధన కోసం కా ర్మికులు, ప్రజలు ధైర్య సాహసాలతో ఉద్య మించారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ పాలనలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి జరు గుతున్నది. యువ నేత కేటీఆర్ నేతృత్వంలో సాంకేతికతలో ముందుకు సాగుతున్నది. రా మగుండం ప్రాంతంపై కేసీఆర్, కేటీఆర్‌కు మ క్కువ ఎక్కువగా ఉన్నది. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధికి కృషి చేయాలి.
-రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
కేసీఆర్, కేటీఆర్‌తోనే అభివృద్ధి
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తోనే రామగుండం పారిశ్రామిక ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రత్యేక పోరాటంలో ‘రామగుండానికి రావాలి మళ్లీ వెలుగులు’ అని కేటీఆర్ పాదయాత్ర చేసి ఈ ప్రాంతంపై ప్రేమను చాటుకున్నారు. అనేక మంది యు వకులకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ను అడిగిన వెం టనే రామగుండానికి మెడికల్ కాలేజీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, కోర్టును మంజూరు చేశారు. యువతకు ఉపాధి కల్పనకు ఐటీ, ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు కు అంగీకరించారు. అది త్వరలోనే సాకారమవుతుంది. గోదావరిఖని ప్రాంతం లో ఎప్పు డూ ఎండిపోయి ఎడారిగా ఉండే గోదావరి నది కేసీఆర్ కృషితోనే కాళేశ్వరం జ లాలతో నిండు కుండలా మారింది. ఈ ప్రాం త అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ రూ.వంద కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరుతు న్నా. వరదల సమయంలో ప్రజ లు ఇబ్బంది పడుతున్నం దునా కరకట్ట నిర్మించాలి. సింగరేణిని మంత్రి ఒప్పించి నిధులు మంజూరు చే యించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇందుకు మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందిస్తరని ఆశిస్తున్న. తాను ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా.
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్