గోదావరిఖని, జూలై 1: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సముద్రాన్ని తలపించిన గోదావరి.. నేడు రేవంత్‌రెడ్డి పాలనలో ఏడారిగా మారిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మంచిర్యాల పర్యటనకు వెళ్తున్న ఆయన, గోదావరిఖనిలోని గోదావరి వంతెనపై ఆగారు.
నీళ్లు లేక వెలవెలబోతున్న నదిని పరిశీలించారు. తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసే లక్ష్యంతో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని, ఎదురెక్కిన జలాలతో గోదావరి నది నాడు కళకళలాడిందని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎడారిగా మార్చిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కుతుందని దుయ్యబట్టారు. ఇక్కడ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్, బాల్క సుమన్ ఉన్నారు.