లండన్: నాలుగేండ్ల తర్వాత వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో రీఎంట్రీ ఇచ్చిన అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు షాక్ తగిలింది. తను తొలి రౌండ్లోనే ఓడి ఇంటిదారి పట్టగా.. ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ మిరా ఆండ్రీవాకు రెండో రౌండ్లోనే ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఐదో సీడ్ రష్యా స్టార్ ఆండ్రీవా 6-4, 5-7, 4-6తో బార్బోరా క్రెజికోవా (చెక్) చేతిలో పోరాడి ఓడింది.
టాప్ సీడ్ సబలెంకా (బెలారస్) 6-1, 7-6 (11/9)తో కెస్లెర్ (అమెరికా)పై, నాలుగో సీడ్ పెగులా (అమెరికా) 7-6 (8/6), 6-1తో సోరిబెస్ (స్పెయిన్)పై గెలిచారు. ఏడో సీడ్ గాఫ్ (అమెరికా) 6-3, 3-6, 7-6 (10/7) తో సియెరా (అర్జెంటీనా)పై, 14వ సీడ్ ఒసాకా (జపాన్) 6-3, 6-2తో గసనోవా (రష్యా)ను ఓడించి మూడో రౌండ్ చేరారు.
మంగళవారం అర్ధరాత్రి జరిగిన తొలి రౌండ్లో 44 ఏండ్ల సెరెనా 3-6, 7-6 (8/6), 3-6తో మాయా జాయింట్ (ఆస్ట్రేలియా) చేతిలో మూడు సెట్ల పాటు పోరాడి ఓడిపోయింది. కాగా, పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో వరల్డ్ నంబర్ వన్ సినర్ (ఇటలీ) 7-6 (7/4), 7-6 (7/2), 6-4తో నునో బోర్గెస్ (పోర్చుగల్)ను వరుస సెట్లలో ఓడించగా.. 8వ సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 3-6, 6-3, 7-5, 6-2తో అగైలర్ (స్పెయిన్)పై నెగ్గాడు.