హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్, నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో పర్యాటకులకు ఆం క్షలు విధించారు. జూలై 1నుంచి సెప్టెంబర్ 30 వరకు ఫారెస్ట్ రిజర్వ్ ప్రాంతాల్లో జనసంచారంపై పూర్తిస్థాయిలో ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు చెప్పా రు. పులుల సంతానోత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.