శనివారం 16 జనవరి 2021
Kamareddy - Nov 07, 2020 , 02:01:39

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌

పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు 

సదాశివనగర్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ అన్నారు. మండలంలోని భూంపల్లిలో పద్మాజివాడి విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్క, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.  కార్యక్రమంలో పద్మాజివాడి విండో అధ్యక్షుడు గంగాధర్‌, వైస్‌ చైర్మన్‌ కుంట శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ గైని అనసూయ, జడ్పీటీసీ సభ్యుడు నర్సింహులు, వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌ రెడ్డి,  సర్పంచులు లలితాబాయి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు రాజేశ్వర్‌ రావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గడీల భాస్కర్‌, ఉపసర్పంచ్‌ పశుల సాయిలు, విండో సీఈవో దేవేందర్‌ రావు, డైరెక్టర్లు గాండ్ల సాయిలు, లింగారెడ్డి, సంజీవరెడ్డి, భాస్కర్‌రావు, రఘునాథ్‌రావు, భీమయ్య, గోవింద్‌ రావు, బాలవ్వ, సాయిలు, లలిత, విండో సిబ్బంది పాల్గొన్నారు.

రామారెడ్డి : మండలంలోని అన్నారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాచారెడ్డి సొసైటీ చైర్మన్‌ పూల్‌చంద్‌, రామారెడ్డి ఎంపీపీ దశరథ్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ గురజాల నారాయణరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వంచ గోపాల్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ రవీందర్‌ రావు, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు చంద్రకళ, సొసైటీ డైరెక్టర్‌ స్వామిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంతో పాటు గిద్ద గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏడీఏ రత్న పరిశీలించారు. ఆమె వెంట ఏవో హరీశ్‌ ఉన్నారు. 

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జేసీ...

నస్రుల్లాబాద్‌ : మండలంలోని దుర్కి, మిర్జాపూర్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో రాజాగౌడ్‌, విండో చైర్మన్లు దివిటి శ్రీనివాస్‌, మారుతి, నాయకులు వెంకటి, కిశోర్‌ యాదవ్‌ ఉన్నారు. 

రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి

దోమకొండ/ బీబీపేట : కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారిణి సునీత అన్నారు. బీబీపేట మండల కేంద్రంతో పాటు దోమకొండ, అంచనూర్‌ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధాన్యంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, 17 శాతానికి మించి తేమ లేకుండా చూడాలని రైతులకు సూచించారు. ఏఈవోల వద్ద ఉన్న రిజిస్టర్లు, ధాన్యం తూకం వేసే తీరును పరిశీలించారు. అనంతరం బీబీపేటలోని రైతువేదికను పరిశీలించారు. కార్యక్రమంలో ఏవో పవన్‌ కుమార్‌, బీబీపేట, దోమకొండ సొసైటీ సీఈవోలు, నర్సాగౌడ్‌, బాల్‌రెడ్డి, ఏఈవోలు సాగర్‌, లత, సాయిప్రసన్న, కిష్టారెడ్డి, రైతుబంధు సమితి బీబీపేట గ్రామ కోఆర్డినేటర్‌ మీసాల సత్తయ్య, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. 

మాచారెడ్డి : మండల కేంద్రంతోపాటు ఆరెపల్లి, భవానీపేట, పాల్వంచ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల వ్యవసాయాధికారి రాజు పరిశీలించారు. ఆయన వెంట ఏఈవోలు లావణ్య, రజిని, ప్రభాకర్‌ ఉన్నారు.