రోటరీ క్లబ్ సభ్యులను అభినందించిన కలెక్టర్ కృష్ణఆదిత్య
భూపాలపల్లి రూరల్, జూలై 30 : జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో అత్యవసర వైద్య సేవలందించేందుకు ఆధునిక సౌకర్యాలతో కూడిన మోటర్ వెహికల్ అంబులెన్స్‌ను రోటరీ క్లబ్ వరంగల్ వారు శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ కృష్ణ ఆదిత్యను కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని అభినందించారు. పేద ప్రజలకు వైద్య సేవలందించేందుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల బలోపేతం కోసం తాము ప్రభుత్వానికి సహకరిస్తామని, అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ ప్రెసిడెంట్ బీ ఆనందరావు, సెక్రటరీ కే శివప్రసాద్, ట్రెజరర్ రమేశ్‌బాబు, కాళోజి హెల్త్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, జిల్లా పౌర సంబంధాల అధికారి రవికుమార్ పాల్గొన్నారు.