గురువారం 25 ఫిబ్రవరి 2021
Jayashankar - Feb 03, 2021 , 01:39:57

మౌలిక వసతుల కల్పనకు కృషి

మౌలిక వసతుల కల్పనకు కృషి

బీడీఎల్‌ ఏజీఎం కోటేశ్వర్‌రావు

భూపాలపల్లి జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

చిట్యాల, ఫిబ్రవరి 2 : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ఎంపికచేసిన మారుమూల గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తామని బీడీఎల్‌(భారత్‌ డైనమిక్‌ లిమిటెడ్‌-ప్రభుత్వరంగ సంస్థ రక్షణ మంత్రిత్వశాఖ) ఏజీఎం కోటేశ్వర్‌రావు అన్నారు. కార్పొరేషన్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ(సీఎస్‌ఆర్‌)లో భాగంగా సిడినెపల్లి, గంగారం(కాటారం మండలం), గొర్లవేడు (భూపాలపల్లి), రాఘవపూర్‌ (టేకుమట్ల)తో పాటు మంగళవారం నవాబుపేటను సందర్శించినట్లు కంపెనీ టీం మెం బర్స్‌ తెలిపారు. ఈ మేరకు  గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ కసిరెడ్డి సాయిసుధ అధ్యక్షతన గ్రా మస్తులతో సమీక్ష నిర్వహించారు. గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. చెక్‌డ్యాం, సోలార్‌లైట్లు, 33/11 సబ్‌స్టేషన్‌, డ్రైనేజీ, పీహెచ్‌సీ, వాటర్‌ప్లాంట్‌ కావాలని సర్పంచ్‌ కోరగా త్వరలోనే తమ కంపెనీ నుంచి ని ధుల కేటాయించేందుకు కృషిచేస్తామని వారు తెలిపారు. సమీక్షలో బీడీఎల్‌ కంపెనీ డీజీఎం సత్యనారాయణరావు, ఎస్‌ఎం నాగేశ్వర్‌రావు, మేనేజర్లు కృష్ణవర్ధన్‌, అజ్మీర ఆల్‌సింగ్‌, ఎంపీవో శంకర్రావు, జీపీ పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు.

VIDEOS

logo