కాలక్రమేణా, ఈ పండుగ ఆఫ్రికన్, దేశీయ, యూరోపియన్ సంస్కృతుల మిశ్రమం నుంచి ఉద్భవించింది. ప్రస్తుతం బ్రెజిల్ విభిన్న వారసత్వాన్ని, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రత్యేకమైన సంబరంగా నిలుస్తున్నది.
Rio Carnival | ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రియో కార్నివాల్ బ్రెజిల్‌లో ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ ఇది. బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నగరంలో జరిగే ఈ కార్నివాల్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది.
రియో కార్నివాల్ బ్రెజిల్ విభిన్న వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ పండుగ సంగీతానికి, నృత్యానికి ప్రత్యేక శోభను చేకూరుస్తుంది. ఈ సంబరాల కోసం ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది వస్తుంటారు.
ఈ గ్రాండ్ కార్నివాల్ బ్రెజిలియన్ సంస్కృతి, సృజనాత్మకత, సంతోషానికి స్ఫూర్తిగా జరుపుకుంటారు.
ఈ నెల 9 న ప్రారంభమైన ఈ పండుగ ఫిబ్రవరి 17 వరకు జరుగుతుంది. ఈ సమయంలో రియో నగరం వీధుల్లో రంగుల రంగుల దుస్తులు ధరించిన, నృత్యాలు చేసే దృశ్యాలు కనిపిస్తాయి
గ్రీకు వసంతోత్సవంలో రియో కార్నివాల్‌కు సంబంధించిన మూలాలు ఉన్నాయి. ఈ పండుగ వైన్ దేవుడు( గాడ్ ఆఫ్ వైన్), డియోనిసస్‌కు అంకితం చేయబడిందని నమ్ముతారు. రోమన్లు కూడా ఇదే సంప్రదాయాన్ని అనుసరిస్తారు.
రోమన్ గాడ్ ఆఫ్ వైన్ అయిన బైచస్ గౌరవార్థం ఈ విందు ఏర్పాటు చేస్తునట్లు నమ్ముతారు. ఈ కార్నివాల్ మూలాలు 1723లో ఉన్నాయని చెబుతారు.
ఎకోరెస్, మదీరా, కాబో వెర్డే దీవుల నుండి పోర్చుగీస్ వలసదారులు ఎంట్రుడోను ప్రారంభించారు. అప్పట్లో ప్రజలు వీధుల్లో తిరుగుతూ ఒకరిపై ఒకరు బకెట్లతో నీరు పోస్తూ తడిపేవారట. బురదతో ఆహారాన్ని కూడా ఒకరిపై ఒకరు విసురుకునేవారట. తద్వారా వీధుల్లో గొడవలు, అల్లర్లు జరిగేవట.
రియో కార్నివాల్‌లో ముఖ్యమైన ఆకర్షణ సాంబా పరేడ్ అని చెప్పవచ్చు. ఇది విస్తృతమైన ప్రభలతో, మిరుమిట్లు గొలిపే దుస్తుల వేషధారణతో సాంబా లయలతో జరిగే ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రదర్శనగా చెప్పవచ్చు.
ఈ ప్రధాన కవాతు సాంబాడ్రోమ్ స్టేడియంలో నిర్వహిస్తారు. సాంబా పాఠశాలలు ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్ టైటిల్ కోసం పోటీపడతాయి. ప్రతి పాఠశాలకు చెందిన విద్యార్ధులు సంగీతం, నృత్యంతో కూడిన దృశ్య కళాత్మకత కథలను ప్రదర్శించి వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు.
ఫిబ్రవరి 17 వరకు కొనసాగనున్న కార్నివాల్ ఈ సంవత్సరం కార్నివాల్ ఫిబ్రవరి 9న ప్రారంభమైంది. దీనిలో సాంబ కవాతు ఫిబ్రవరి 9 ,10 తేదీలలో నిర్వహించారు. ఫిబ్రవరి 11, 12 తేదీలలో ప్రత్యేక బృందాల కవాతులు జరిగాయి.
ఫిబ్రవరి 17 వరకు కొనసాగనున్న కార్నివాల్ ఈ సంవత్సరం కార్నివాల్ ఫిబ్రవరి 9న ప్రారంభమైంది. దీనిలో సాంబ కవాతు ఫిబ్రవరి 9 ,10 తేదీలలో నిర్వహించారు. ఫిబ్రవరి 11, 12 తేదీలలో ప్రత్యేక బృందాల కవాతులు జరిగాయి.
మొత్తం మీద కార్నివాల్, సాంస్కృతిక, సంగీతాల మేళవింపుతో అధ్భుతమైన రంగు,రంగుల ఈవెంట్‌గా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది.