సూర్యగ్రహణం 2021: ప్రపంచవ్యాప్త బెస్ట్ పిక్స్

హైదరాబాద్ : ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం జూన్ 10వ తేదీన అంటే ఇవాళ ఏర్పడ్డ విషయం తెలిసిందే. గ్రహణ వీక్షణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆకర్షణీయమైన అనుభవాన్ని పంచింది. కెనడా, యునైటెడ్ స్టేట్స్, యూకే, ఉత్తరాది ప్రాంతాలలో ఉన్నవారు పాక్షిక గ్రహణాన్ని మాత్రమే వీక్షించగా.. రింగ్ ఆఫ్ ఫైర్ గ్రీన్లాండ్ అదేవిధంగా ఉత్తర అక్షాంశాలలో మాత్రమే సంపూర్ణంగా కనిపించింది. కెనడాలోని అంటారియో సమీపంలో సూర్యగ్రహణం ప్రారంభమైంది. ఈశాన్య యునైటెడ్ స్టేట్స్, గ్రీన్లాండ్, ఉత్తర ఐరోపా అంతటా తిరుగుతూ సైబీరియన్ రష్యాలో ముగిసింది. గ్రహణం యొక్క అద్భుతమైన ఫోటోలతో ట్విట్టర్ నిండిపోయింది.
భారత కాలమానం ప్రకారం సూర్యగ్రహణం జూన్ 10న మధ్యాహ్నం 01.42 గంటలకు ప్రారంభమై సాయంత్రం 06.41 గంటల వరకు పూర్తిగా ముగిసింది. భారతదేశంలో సూర్యగ్రహణం లడఖ్, అరుణాచల్ ప్రదేశ్లో మాత్రమే కనిపించింది. గ్రహణం సుమారు 100 నిమిషాల పాటు కొనసాగింది.





Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

