e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home జనగాం ఏడేళ్ల పాలనలో బలమైన పునాదులు

ఏడేళ్ల పాలనలో బలమైన పునాదులు

ఏడేళ్ల పాలనలో బలమైన పునాదులు
  • స్వరాష్ట్రంలోనే జనగామ జిల్లా అభివృద్ధి
  • దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ
  • సీఎం కేసీఆర్‌ పాలనలో పెరిగిన సాగు విస్తీర్ణం
  • తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మండలి చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు
  • హాజరైన కలెక్టర్‌ నిఖిల, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

జనగామ, జూన్‌ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు బుధవారం జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ నిబంధనల మేరకు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో శాసనమండలిలో చీఫ్‌విప్‌ బోడకుంటి వెంక టేశ్వర్లు జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వంద నాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా బోడకుంటి మాట్లాడుతూ త్యాగాలతో సాధించుకున్న రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుకున్నామని చెప్పారు. బంగారు తెలంగాణ దిశగా ఏడేండ్ల కాలంలోనే ధ్రుడమైన పునాదులతో సుస్థిరతను సాధించిందని, ఉద్యమ నినాదాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. సాగు, తాగునీరు, విద్యుత్‌, విద్య, వైద్యం, రోడ్లు వంటి మౌలిక వసతులు, స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలను పూర్తి చేసుకుం టూ ముందుకు సాగుతున్నామని అన్నారు. రైతాంగానికి పుష్క లంగా సాగు నీరు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అంది స్తున్న ఫలితంగా సాగు విస్తీర్ణం పెరిగి అంచనాలకు మించి దిగు బడి వచ్చిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోలేని విధంగా కనీస మద్దతు ధరకు గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు పండించిన ప్రతి గింజను కొంటున్నామని చెప్పారు.

యాసంగి పంట కోసం జిల్లాలో 195 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటికే లక్షా 63 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 27,797 మంది రైతుల ఖాతాల్లో రూ.182.50 కోట్లు జమ చేశామని వెంకటేశ్వర్లు తెలిపారు. కొవిడ్‌ నియం త్రణ, చికిత్స కోసం జిల్లాలో పకడ్బందీ చర్యలు తీసుకుంటు న్నామన్నారు. ఇప్పటికే రెండు విడుతలుగా ఇంటింటా ఆరోగ్య సర్వే నిర్వహించామని, ప్రతి ఆరోగ్య కేంద్రంలో రోజూ కొవిడ్‌ ఓపీ నిర్వహిస్తూ కరోనా లక్షణాలున్న 13,715 మందికి మెడికల్‌ కిట్లు అందించామన్నారు. జిల్లాలో 10 కొవిడ్‌ చికిత్స ఆస్పత్రుల్లో ఐసొలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 74,208 డోసులు ఇచ్చామని, 1600మంది సూపర్‌స్ప్రెడర్స్‌ను గుర్తించి మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చామన్నారు. జిల్లాలో 2,067 మంది ప్రైవేట్‌ టీచర్లు, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి ఏప్రిల్‌, మే మాసాల్లో 25 కిలోల సన్నబియ్యం ఉచితంగా అందించామని చెప్పారు.

జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంపై జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, మున్సిపల్‌ కార్యాలయంపై చైర్‌పర్సన్‌ పోకల జమునాలింగయ్య, ఆర్డీవో కార్యాలయంలో మధుమోహన్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంపై చైర్‌పర్సన్‌ బాల్దె విజయ సిద్ధిలింగం, జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యాలయంపై గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఏడవెల్లి కృష్ణారెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్‌ నిమ్మతి మహేందర్‌రెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించి ఏడేళ్ల పాలన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల లింగయ్య, వైస్‌ చైర్మన్‌ మేకల రాంప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పోకల లింగయ్య, కౌన్సిలర్లు వాంకుడోత్‌ అనిత, తాళ్ల సురేశ్‌రెడ్డి, కర్రె శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు నాగరాజు పాల్గొన్నారు.

కేసీఆర్‌ పాలన దేశానికే దిక్సూచి
ఎందరో త్యాగధనుల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న కార్యక్రమాలు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన జెండా ఆవిష్కరించి మాట్లాడారు. సూర్యచంద్రులున్నంత కాలం కేసీఆర్‌ పాలన చరిత్రలో లిఖించబడి ఉంటుందన్నారు. కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలను అన్ని రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని ముత్తిరెడ్డి వివరించారు. దుర్భిక్షాన్ని ఎదుర్కొన్న జనగామ ప్రాంతం గోదావరి జలాలతో తడిసి పచ్చటి పొలాలతో అలలారుతున్నదని చెప్పారు.

నర్మెటలో..
నర్మెట : మండల కేంద్రంలోని సర్కిల్‌ కార్యాలయంలో సీఐ కరుణాకర్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ తేజావత్‌ గోవర్ధన్‌, తహసిల్‌ ఆఫీస్‌లో తహసీల్దార్‌ మురళీధర్‌రావు, ఎంఈవో భగవాన్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ వెంకటేశం, పీహెచ్‌సీలో వైద్యాధికారి మోజెస్‌రాజ్‌, టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు నీరేటి సుధాకర్‌ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ కోఅప్షన్‌ సభ్యుడు ఎండీ గౌస్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ఆమెడపు కమలాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు పెద్ది రాజిరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు చింతకింది సురేశ్‌, టీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు గడపురం శశిరథ్‌, గ్రామ అధ్యక్షుడు కొన్నె చంద్రయ్య పాల్గొన్నారు.

బచ్చన్నపేటలో..
బచ్చన్నపేట : మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్లో ఎస్సై లక్ష్మణ్‌రావు, టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి త్రివర్ణపతాకాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీస్‌ చైర్మన్‌ పూర్ణచందర్‌, సర్పంచ్‌ మల్లారెడ్డి, మండల పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు షబ్బీర్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు నరేందర్‌, గుర్రపు బాలరాజు, మహేందర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, సిద్ధులు, గిరిబోయిన అంజయ్య ఉన్నారు.

లింగాలఘనపురంలో..
లింగాలఘనపుర : మండల కేంద్రంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎస్సై దేవేందర్‌, ట్రాన్స్‌కో ఏఈ మధు, సర్పంచ్‌ సాదం విజయమనోహర్‌, డాక్టర్‌ కరుణాకర్‌రాజు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీవో మల్లికార్జున్‌ , ‘దిశ’ సభ్యురాలు ఉడుగుల భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ కేమిడి భిక్షపతి, ఉపసర్పంచ్‌ కేమిడి కవితావెంకటేశ్‌ పాల్గొన్నారు.

రఘునాథపల్లిలో..
రఘునాథపల్లి : మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయ ఆవరణలో పార్టీ మండల అధ్యక్షుడు వై కుమార్‌గౌడ్‌, జడ్పీటీసీ బొల్లం అజయ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు మడ్లపల్లి సునీత, పోలీస్‌స్టేషన్‌లో సీఐ వినయ్‌కుమార్‌, ఎస్సై రాజేశ్‌నాయక్‌, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు జాతీయజెండాలను అవిష్కరించి అమరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కంచనపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ చీమలపాటి రవీందర్‌జీ, టీఆర్‌ఎస్‌ మండల ఇన్‌చార్జి వెంకటస్వామి, సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోకల శివకుమార్‌, నాయకులు నామాల బుచ్చయ్య, దుబ్బాక హరీశ్‌, రాస మల్ల కొమురయ్య పాల్గొన్నారు.

దేవరుప్పులలో..
దేవరుప్పుల : మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ స్వప్న, మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఎంపీడీవో ఉమామహేశ్వర్‌, పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఎస్సై చెన్నమనేని కరుణాకర్‌రావు జాతీయ జెండాలను ఎగురవేసి సంబురాలు జరుపుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు పతాకావిష్కరణ చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బస్వ సావిత్రి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ ఈదునూరి నర్సింహారెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ జోగు సోమనర్సయ్య, జిల్లా గ్రంథాలయ సంస్ధ డైరెక్టర్‌ కారుపోతుల భిక్షపతి, టీఆర్‌ఎస్‌ యూత్‌ మండల అధ్యక్షుడు చింత రవి, నాయకులు బస్వ మల్లేశ్‌, కోతి ప్రవీణ్‌, కిష్టయ్య, దశరథ, తోటకూరి వెంకన్న పాల్గొన్నారు.

తరిగొప్పులలో..
తరిగొప్పుల : మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ మహ్మద్‌ ఫరీదొద్దీన్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ జొన్నగోని హరితాసుదర్శన్‌ గౌడ్‌, మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్‌ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ దామెర ప్రభుదాస్‌ జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ముద్దసాని వెంకట్‌రెడ్డి, చెన్నూరి సంజీవ, చిలివేరు లింగం, అంకం రాజరాం, కుర్ర మల్లయ్య, తాళ్లపల్లి పోషయ్య, జొన్నగోని కిష్టయ్య పాల్గొన్నారు.

జఫర్‌గఢ్‌లో..
జఫర్‌గఢ్‌ : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రడపాక సుదర్శన్‌, తహసిల్‌ ఆఫీస్‌లో తహసీల్దార్‌ వీరస్వామి, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై కిషోర్‌, పీహెచ్‌సీలో వైద్యాధికారి రాజు, పశువైద్యశాలలో పశువైద్యాధికారి వింద్య, జఫర్‌గఢ్‌, సాగరం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు వెంకటనర్సింగరావు, గాదె ప్రవీణ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల కార్యాలయంలో పార్టీ మండలాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి జాతీయ జెండాలను ఎగురవేశారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ ఇల్లందుల బేబి. ఎంపీడీవో శ్రీధర్‌స్వామి, ఏవో హరిదాస్‌, జఫర్‌గఢ్‌ ఎంపీటీసీ సభ్యులు రజిత, స్రవంతి పాల్గొన్నారు.

పాలకుర్తిలో..
పాలకుర్తి రూరల్‌ : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, ఎంపీడీవో వనపర్తి ఆశోక్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌, పోలీస్‌స్టేషన్‌ సీఐ వి చేరాలు, ఎస్సై గండ్రాతి సతీష్‌, తహసిల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ ఎన్‌ విజయభాస్కర్‌, ప్రభుత్వ దవాఖానలో వైధ్యాధికారి గెడెం యామిని, మిషన్‌ భగీరథ కార్యాలయంలో డీఈ సంధ్యారాణి, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ వీరమనేని యాకాంతారావు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

కొడకండ్లలో..
కొడకండ్ల : మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో చైర్మన్‌ పేరం రాము, మండల పరిషత్‌లో ఎంపీపీ జ్యోతి రవీంద్రగాంధీనాయక్‌, గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ పసునూరి మధుసూదన్‌, నర్సింగపురంలో సర్పంచ్‌ దండెంపల్లి శ్రీలత జాతీయ జెండాలను ఆవిష్కరించారు.రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దీకొండ వెంకటేశ్వర్‌రావు, ఎంపీటీసీలు అందె యాకయ్య, కుందూరు విజయలక్ష్మీ, సొసైటి వైస్‌ చైర్మన్‌ సోమరాములు, కో ఆప్షన్‌ సభ్యుడు నజీర్‌, ప్రధాన కార్యదర్శి కైరోజు సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యాక్షుడు అమరేందర్‌ రెడ్డి, మార్కెట్‌ డైరెక్టర్స్‌ దూలం సతీశ్‌, విజయమ్మ, బాబర్‌, రమేశ్‌ పాల్గొన్నారు.

చిలుపూర్‌లో..
చిలుపూర్‌ : మండల కేంద్రంలో సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, రాజవరంలో సర్పంచ్‌ మారపెల్లి తిరుమల-కృష్ణమోహన్‌రెడ్డి, పాఠశాలలో హెచ్‌ఎం సుజాత జాతీయ పతాకాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హేమలత, మురళీధర్‌, వంశీ కృష్ణ, జగదీశ్‌, సీఆర్పీ భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్‌ ఈర్ల రూపేశ్‌, ఎంపీపీటీసీ తాళ్ళపెల్లి ఉమాసమ్మయ్య, మారపెల్లి లలితాశ్యామ్‌ కుమార్‌రెడ్డి, ఇల్లందుల సుదర్శన్‌, జనగామ యాదగిరి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఏడేళ్ల పాలనలో బలమైన పునాదులు

ట్రెండింగ్‌

Advertisement