శనివారం 06 మార్చి 2021
Jangaon - Feb 20, 2021 , 02:06:49

పాడి పరిశ్రమతో అదనపు ఆదాయం

పాడి పరిశ్రమతో అదనపు ఆదాయం

విజయ డెయిరీ ఎండీ శ్రీనివాస్‌రావు

దేవరుప్పుల, ఫిబ్రవరి 19 : పాడిపరిశ్రమతో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటే రైతు కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని విజయ డెయిరీ ఎండీ శ్రీనివాస్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని కామారెడ్డిగూడెంలో శుక్రవారం రాత్రి బల్క్‌ కూలింగ్‌ సెంటర్‌ను పరిశీలించిన ఆయన పలు గ్రామాల పాల ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. విజయ డెయిరీ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ రమేశ్‌ పాల్గొన్న ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ సంస్థను కాపాడుకుని ప్రభుత్వ అందించే సదుపాయాలు పొందాలన్నారు. రైతులు వ్యవసాయానికి తోడు పాడి పరిశ్రమను ప్రత్యామ్నాయంగా ఎన్నుకుని నెల వారీగా ఆదాయాన్ని పొందవచ్చిన్నారు. పాడిగేదెలకు ఇచ్చే రుణాల్లో రూ.10 వేల సబ్సిడీని విజయ డెయిరీ ఇస్తుందన్నారు. లీటరు పాలపై ప్రభుత్వ రూ.3, డెయిరీ రూ.1 ఇస్తున్నదని, పశువుల దాణా, మినరల్‌ మిక్చర్‌ అందిస్తుందని తెలిపారు. అనంతరం పాల ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు శ్రీనివాస్‌రావు, డీ రమేశ్‌ను సన్మానించారు.ఈ కార్యక్రమం లో కామారెడ్డిగూడెం, సీతారాంపురం, దేవరుప్పుల, కడవెండి పాల ఉత్పత్తిదారుల సంఘాల అధ్యక్షులు ఓడపల్లి రవి, బాషిపాక కొండయ్య. తోటకూరి పుష్ప, పంతం సోమయ్య, పాల కేంద్రం డైరెక్టర్లు నర్సింహ, యాకూబ్‌, దశరథ, వెంకన్న పాల్గొన్నారు.


VIDEOS

logo