ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 13, 2021 , 00:42:10

ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలను ప్రారంభించాలి

ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలను ప్రారంభించాలి

జనగామ చౌరస్తా, జనవరి 12 : సీఎం కేసీఆర్‌ ఆదేశాలకనుగుణంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి జిల్లాలో విద్యా సంస్థలను పునః ప్రారంభించాలని కలెక్టర్‌ నిఖిల అన్నా రు. మంగళవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. నిఖిల మాట్లాడుతూ 9వ తరగతి నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు బోధన అందించాలన్నారు. ఇంటర్‌, డిగ్రీ, వృత్తి విద్యా కోర్సుల తరగతులను సైతం కొనసాగించాలని ఆమె కోరారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలలు, హాస్టళ్లు, రెసిడెన్సియల్‌ పాఠశాలలను ఇందుకు సిద్ధం చేయాలని నిఖిల ఆదేశించారు. విద్యార్థులు మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, అబ్దుల్‌ హమీద్‌, జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కోర్నేలియస్‌, మైనార్టీ సంక్షేమాధికారి వెంకటరమణ, గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాస్‌, సాంఘిక సంక్షేమ వసతి గృహాల అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.


VIDEOS

logo