ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Dec 23, 2020 , 00:38:43

పేదల పాలిట దేవుడు సీఎం కేసీఆర్‌

పేదల పాలిట దేవుడు సీఎం కేసీఆర్‌

  •  క్రిస్మస్‌ కిట్ల పంపిణీలో ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌/జఫర్‌గఢ్‌,డిసెంబర్‌22: సర్వమతాల పండుగలను సమానంగా చూస్తూ సీఎం కేసీఆర్‌ పేదల పాలిట దేవుడయ్యారని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా మండల కేంద్రంలో మంగళవారం నియోజకవర్గ స్థాయిలో క్రైస్తవులకు దుస్తుల కిట్లను అందించారు. తొలుత ఎమ్మెల్యే రాజయ్య క్రిస్మస్‌ కేకు కట్‌ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి ఫాదర్‌ తాటికొండ జోసఫ్‌ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడారు. జడ్‌పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా కారణంగా క్రిస్మస్‌ వేడకలను ఘనంగా నిర్వహించడం లేదన్నారు. అనంతరం చిన్నారుల నృత్యం అలరించింది. సమావేశంలో ఎంపీపీ కందుల రేఖగట్టయ్య, తహసీల్దార్‌ విశ్వప్రసాద్‌, మండల ప్రత్యేకాధికారి భిక్షపతి, ఎంపీడీవో కుమారస్వామి, ఎంపీవో మహబూబ్‌అలీ, సర్పంచ్‌ సురేశ్‌కుమార్‌, ఉప సర్పంచ్‌ నీల ఐలయ్య, ఎంపీటీసీలు రాజు, ఫాదర్‌ సురేందర్‌, పాస్టర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.  జఫర్‌గఢ్‌ మండలం తిమ్మంపేటలో క్రైస్తవులకు దుస్తులను ఎమ్మెల్యే రాజయ్య పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని 17 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.17,01,972 విలువ గల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రడపాక సుదర్శన్‌, వైస్‌ ఎంపీపీ కొడారి కనుకయ్య, జడ్పీటీసీ ఇల్లందుల బేబీ శ్రీనివాస్‌, ప్రజాప్రతినిధులు, పాస్టర్లు పాల్గొన్నారు.

పేదలకు దుస్తులు, స్వీట్లు పంపిణీ

బచ్చన్నపేట: కట్కూర సినాయ్‌ చర్చిలో మంగళవారం క్రిస్టమస్‌ వేడుకలు నిర్వహించారు. గాడ్స్‌ హార్ట్‌ ఫర్‌ ది నేషన్స్‌ డైరెక్టర్‌ పిన్నింటి స్టాన్లీ ఆధ్వర్యంలో చర్చిలో కేక్‌ కట్‌చేసి పేదలకు దుస్తులు, స్వీట్లు అందించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 

పాస్టర్లకు దుస్తుల పంపిణీ

నర్మెట: నర్మెట, తరిగొప్పుల మండలాలకు చెందిన 50 పాస్టర్లకు మండల కేంద్రంలోని బిలివర్‌ చర్స్‌లో మంగళవారం కొమ్మూరి ప్రతాపరెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో దుస్తులను పంపిణీ చేశారు. క్రిస్మస్‌ను పురస్కరించుకొని కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి, మాసంపల్లి లింగాజీ, గొల్లపల్లి కుమరస్వామి, గంగం నర్సింహ్మారెడ్డి పాల్గొన్నారు. 


VIDEOS

logo