Jangaon
- Oct 10, 2020 , 06:39:11
VIDEOS
వారం రోజుల్లో రహదారుల మరమ్మతు

జనగామ, అక్టోబర్ 9 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న జనగామ పట్టణంలోని రహదారుల మరమ్మతు పనులను వారం రోజుల్లో చేపడుతామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చెప్పారు. శుక్రవారం జనగామలో జరిగిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నూతన బీటీ రోడ్డు పనులకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు. స్వయంగా తానే పనులు ప్రారంభిస్తానని ఎమ్మెల్యే వివరించారు. జనగామ పట్టణాన్ని రాష్ట్రంలోనే స్వచ్ఛ జనగామగా తీర్చి దిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని, ఇందుకు ప్రజల సహకారం అవసరమని ముత్తిరెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING