నేడే మూడో విడత
మూడో విడత లోక్‌సభ ఎన్నికల సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. 11 రాష్ర్టాల్లోని 93 నియోజకవర్గాలకు మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి.
- 11 రాష్ర్టాల్లోని93 స్థానాలకు పోలింగ్
- బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన ఎన్నికలు
- గత ఎన్నికల్లో ఇవే స్థానాల్లో మెజార్టీ సీట్లు కైవసం
- ప్రజ్వల్ వ్యవహారం, రాజ్‌పుత్‌ల వ్యతిరేకతతో ఈ సారి భారీగా సీట్లకు కోతపడే అవకాశం
అహ్మదాబాద్/బెంగళూరు, మే 6: మూడో విడత లోక్‌సభ ఎన్నికల సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. 11 రాష్ర్టాల్లోని 93 నియోజకవర్గాలకు మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 1300 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, జ్యోతిరాదిత్య సింధియా, మన్షుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాలా, ప్రహ్లాద్ జోషీతోపాటు అఖిలేశ్‌యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్, శివరాజ్‌సింగ్ చౌహాన్, దిగ్విజయ్ సింగ్, సుప్రియాసూలే తదితర ప్రముఖుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్దేశించనున్నారు. గుజరాత్లో ఇండోర్ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవం చేసుకోగా, తక్కిన 25 స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే మహారాష్ట్రలో 11, యూపీ 10, కర్ణాటక 14, మధ్యప్రదేశ్ 9, ఛత్తీస్‌గఢ్ 7, బీహార్ 5, అస్సాం, పశ్చిమబెంగాల్లో నాలుగు చొప్పున, గోవా 2, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలో ఒక్కో స్థానం చొప్పున స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరుగనున్నది. మూడో దశ తర్వాత మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గానూ 283 స్థానాలకు ఓటింగ్ పూర్తవుతుంది.
బీజేపీకి పరీక్ష
మూడో విడత ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారనున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ మెజార్టీ సీట్లు సాధించిన గుజరాత్, కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్ లోక్‌సభ స్థానాలకు ఈ దశలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్‌స్కాండల్ ఆరోపణలు, గుజరాత్లో బీజేపీపై రాజ్‌పుత్‌ల ఆగ్రహం నేపథ్యంలో బీజేపీకి ఈ దశ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు. కర్ణాటకలో ఈ విడత ఎన్నికలు జరిగే 14 సీట్లనూ గత ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకున్నది. అయితే ప్రజ్వల్ వ్యవహారం నేపథ్యంలో ఈసారి సీట్లకు భారీ కోత పడే అవకాశం ఉన్నది. గత ఎన్నికల్లో గుజరాత్లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేయగా, ఈసారి రాజ్‌పుత్‌ల వ్యతిరేకత ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీయొచ్చని విశ్లేషకులు అంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

